Hyderabad Police | అర్ధరాత్రి వేళ మానవత్వాన్ని చాటుకున్న కామాఠిపుర పోలీసులు
Hyderabad Police | హైదరాబాద్ కామాఠిపుర పోలీసులు (Hyderabad Police) మానవత్వాన్ని చాటుకున్నారు. అర్ధరాత్రి వేళ వివస్త్రగా తిరుగుతున్న మహిళలకు దుస్తులు అందించడమే కాకుండా ఆశ్రయం కల్పించారు.
Hyderabad Police | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ కామాఠిపుర పోలీసులు (Hyderabad Police) మానవత్వాన్ని చాటుకున్నారు. అర్ధరాత్రి వేళ వివస్త్రగా తిరుగుతున్న మహిళలకు దుస్తులు అందించడమే కాకుండా ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు (బక్రీద్ చెక్ పోస్ట్) వద్ద చోటుచేసుకున్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు వద్ద ఒక మహిళ దుస్తులు లేకుండా తిరుగుతుండటాన్ని కామాఠిపుర చెక్‌పోస్టు పోలీసులు గుర్తించారు. దుకాణాలు తెరిచి లేకపోవడంతో కామాఠిపుర ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు తక్షణమే స్పందించారు. ఆమె గౌరవాన్ని కాపాడేందుకు తన పోలీస్ యూనిఫామ్ షర్టును, పంచను ధరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా చెక్ పోస్ట్ వద్దే ఆశ్రయం కల్పించి అండగా నిలిచారు.
ఈ ఆపరేషన్‌లో రాజేంద్రనగర్ ఏసీపీ (NZO) కిషోర్ గారి పర్యవేక్షణలో కామాఠిపుర ఎస్‌హెచ్‌వో బీ ప్రసాద్ రావు, ఏఎస్ఐ అన్వర్ హుస్సేన్, కానిస్టేబుల్ సుమన్ పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. అర్ధరాత్రి వేళ సమయస్ఫూర్తితో స్పందించి, మహిళా రక్షణకు కట్టుబడి ఉన్న కామాఠిపుర పోలీసుల చొరవను,సేవా గుణాన్ని ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, స్థానిక ప్రజలు అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను, మానవ విలువలను కాపాడటంలో కామాఠిపుర పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని ప్రసాద్ రావు తెలిపారు.
సంబంధిత వార్తలు

Hyderabad Police SOCEYE | సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారా? హైదరాబాద్ పోలీసుల కొత్త ‘ఏఐ’ బ్రహ్మాస్త్రం వచ్చేసింది
మే 18, 2026

CP Sajjanar | నిందితులకు ఈ తీర్పు గుణపాఠం : సీపీ వీసీ సజ్జనార్
మే 15, 2026

Smoking | మీరు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతున్నారా.. అయితే పోలీసులు పట్టుకెళ్తారు జాగ్రత్త!
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



