Special Police Officers | రిటైర్డ్ పోలీసులకు శుభవార్త.. 138 ప్రత్యేక పోలీసు అధికారుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు..
Special Police Officers | తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బందికి శుభవార్త. హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో 138 ప్రత్యేక పోలీసు అధికారుల(SPOs) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు CAR హెడ్‌క్వార్టర్స్, ట్రైనింగ్ డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Special Police Officers | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బందికి శుభవార్త. హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో 138 ప్రత్యేక పోలీసు అధికారుల(SPOs) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు CAR హెడ్‌క్వార్టర్స్, ట్రైనింగ్ డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
అర్హతలు, నిబంధనలు ఇవే..
- ప్రాధాన్యత:మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ అభ్యర్థులలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- నివాస ధృవీకరణ: రిటైర్డ్ పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర నివాతులై ఉండాలి (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించాలి).
- వయోపరిమితి:మాజీ సైనికుల వయస్సు 31-01-2026 నాటికి 58 ఏళ్లలోపు ఉండాలి. మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది పదవీ విరమణ చేసిన రెండేళ్ల లోపు వారై ఉండాలి. గరిష్ట వయోపరిమితి 62 ఏళ్లకు మించకూడదు.
- వేతనం: నెలకు గౌరవ వేతనం రూ. 26,000 చెల్లించబడుతుంది. ప్రత్యేక సెలవుల సౌకర్యం ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో వేతన రహిత సెలవులు మాత్రమే మంజూరు చేయబడతాయి.
అవసరమైన ధృవీకరణ పత్రాలు :
- డిశ్చార్జ్ బుక్ / డిశ్చార్జ్ సర్టిఫికేట్ / రిటైర్మెంట్ ఆర్డర్.
- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, SBI బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, ఓటర్ ఐడీ, కుల ధృవీకరణ పత్రం.
- మాజీ సైనికులు/పారామిలిటరీ అభ్యర్థులకు టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఉంటే సమర్పించాలి.
- డ్రైవర్ అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే LMV / HMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.
దరఖాస్తు విధానం
- ఆసక్తి గల అభ్యర్థులు పైన పేర్కొన్న పత్రాలతో వ్యక్తిగతంగా SPOs ఆఫీస్, CAR హెడ్‌క్వార్టర్స్, పెట్లబుర్జ్, హైదరాబాద్‌ను సందర్శించి దరఖాస్తు సమర్పించవలెను. ఫోన్ ద్వారా సంప్రదింపులు అంగీకరించబడవు.
దరఖాస్తుకు చివరి తేదీ
- మార్చి 5, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




