Sridhar Babu | గ్లోబల్ హెల్త్ టెక్ హబ్‌గా హైదరాబాద్
Sridhar Babu | ప్రపంచ వ్యాప్తంగా AI ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని.. ఆరోగ్యరంగం కూడా కీలక పరివర్తన దశలో ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం హైటెక్‌సిటీలోని యశోద హాస్పిటల్స్‌లో ప్రారంభమైన దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ “AI ఇన్ హెల్త్ కేర్ 2.0” అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగించారు.
- ఆరోగ్యరంగ భవిష్యత్తును పునర్నిర్వచిస్తున్న పరివర్తనాత్మక శక్తే ఏఐ
- వ్యాధి నిర్ధారణలో దాని పాత్ర ఎంతో కీలకం
- ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ “AI ఇన్ హెల్త్ కేర్ 2.0” అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు, వక్తలు
Sridhar Babu | త్రినేత్ర.న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా AI ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని.. ఆరోగ్యరంగం కూడా కీలక పరివర్తన దశలో ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం AI, డిజిటల్ ఇన్నోవేషన్, డీప్‌టెక్ రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. శనివారం హైటెక్‌సిటీలోని యశోద హాస్పిటల్స్‌లో ప్రారంభమైన దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ “AI ఇన్ హెల్త్ కేర్ 2.0” అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సదస్సు పరిశోధన, స్టార్టప్ లు, పరిశ్రమలు, విధాన నిర్ణేతల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసి, తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఇన్నోవేషన్ కేంద్రంగా నిలబెట్టే దిశగా కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.ఎస్.రావు మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో AI వినియోగం వైద్య సేవల నాణ్యత, వేగం, కచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగు పరుస్తోందన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, క్లిష్టమైన కేసుల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలను అందించడం వంటి అంశాల్లో AI విశేష ఫలితాలను అందిస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ సదస్సు, ఆరోగ్యరంగ భవిష్యత్తుపై సార్థకమైన చర్చలకు దోహదపడటమే కాకుండా, కొత్త ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, పరిశోధనలకు మార్గం సుగమం చేసిందని జి.ఎస్.రావు పేర్కొన్నారు.

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, క్లినికల్ డైరెక్టర్, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్. చినబాబు సుంకవల్లి మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదని, అది ఆరోగ్యరంగ భవిష్యత్తును పునర్నిర్వచిస్తున్న పరివర్తనాత్మక శక్తి అని పేర్కొన్నారు. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ, సమర్థవంతమైన వైద్య విధానాలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చికిత్సలను అందించడంలో AI కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ హెల్త్ టెక్ హబ్‌గా మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు పడినట్లు చినబాబు అభివర్ణించారు.
మొదటి ఎడిషన్‌లో ప్రెసిషన్ మెడిసిన్, AI ఆధారిత డయాగ్నస్టిక్స్, డిజిటల్ పాథాలజీ, రోబోటిక్ సర్జరీ, డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ AI అప్లికేషన్స్ తదితర అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐఐఐటీ హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, ఐఎస్‌బీ, నోవార్టిస్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కింగ్స్ కాలేజ్ లండన్, మెడ్ట్రానిక్, టీసీఎస్ తదితర ప్రముఖ సంస్థల నిపుణులు తమ అనుభవాలు, పరిశోధన ఫలితాలు, భవిష్యత్ దృక్పథాలను తెలియజేశాయి. పాలసీ పావిలియన్, స్టార్టప్ ఇన్నోవేషన్ సెషన్లు సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అంతకుముందు ఈ సదస్సును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. ఎస్. రావుతో కలిసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “పవరింగ్ ప్రెసిషన్ అండ్ పర్శలైజింగ్ కేర్” అనే ప్రధాన అంశంపై జూన్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వైద్య సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు, వైద్య పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, AI సాంకేతిక నిపుణులు సహా 2,000 మందికి పైగా హాజరయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



