త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kukatpally | దోమ‌ల నివార‌ణ‌కు పొగ వేస్తే.. మంట‌లు చెల‌రేగి కాలి బూడిదైన గుడిసెలు

Kukatpally | దోమ‌ల నివార‌ణ కోసం పొగ వేస్తుండ‌గా ఒక్క‌సారిగా మంట‌లు (Fire Accident) చెల‌రేగాయి. మంట‌లు తీవ్ర‌రూపం దాల్చ‌డంతో ప‌క్క‌నే ఉన్న గుడిసెలు అగ్నికి ఆహుతైన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో (Kukatpally) చోటుచేసుకుంది.

G

Hyderabad | Published On Oct 23, 2026, 8.10 am IST

Kukatpally | దోమ‌ల నివార‌ణ‌కు పొగ వేస్తే.. మంట‌లు చెల‌రేగి కాలి బూడిదైన గుడిసెలు
Advertisement

Kukatpally | త్రినేత్ర న్యూస్‌: దోమ‌ల నివార‌ణ కోసం పొగ వేస్తుండ‌గా ఒక్క‌సారిగా మంట‌లు (Fire Accident) చెల‌రేగాయి. మంట‌లు తీవ్ర‌రూపం దాల్చ‌డంతో ప‌క్క‌నే ఉన్న గుడిసెలు అగ్నికి ఆహుతైన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో (Kukatpally) చోటుచేసుకుంది.

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన సేవా సంఘం కాలనీలో దోమల నివారణ కోసం పొగ వేశారు. అక్కడ చెలరేగిన మంటలు సమీపంలోని గుడిసెలకు (Huts) అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్ర‌మంలో పక్కనే ఉన్న కట్టెల దుకాణానికి (Timber Shop) మంట‌లు వ్యాపించడంతో అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గాయ‌ప‌డిన ఇద్ద‌రిని చికిత్స నిమిత్తం ద‌వాఖాన‌కు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement