Auto Nagar Colony | ఆటో డ్రైవర్లకు కొత్త హౌసింగ్ స్కీమ్.. అది కూడా హైదరాబాద్‌లో.. వివరాలివే
Auto Nagar Colony | హైదరాబాద్ నగర పరిధిలో జీవనోపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లకు( Auto Drivers ) కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఆటో డ్రైవర్లకు క్యూర్( CURE ) పరిధిలో కొత్త హౌసింగ్ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో నగర్ కాలనీ( Auto Nagar Colony ) ల పేర ఈ కాలనీలను నిర్మించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Auto Nagar Colony | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగర పరిధిలో జీవనోపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లకు( Auto Drivers ) కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఆటో డ్రైవర్లకు క్యూర్( CURE ) పరిధిలో కొత్త హౌసింగ్ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో నగర్ కాలనీ( Auto Nagar Colony ) ల పేర ఈ కాలనీలను నిర్మించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో మొదటి విడతలో మొత్తం 2 వేల ఇండ్లను నిర్మించనున్నారు.
ఆటో నగర్ కాలనీలు ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే..?
- 1. బండ్లగూడ (ఎల్ఐజీ కాలనీ) - 500 ఫ్లాట్స్
- 2. గంధంగూడ - 500 ఫ్లాట్స్
- 3. పేటబషీరాబాద్ - 500 ఫ్లాట్స్
- 4. జల్‌పల్లి లక్ష్మీగూడ - 500 ఫ్లాట్స్
హైదరాబాద్ క్యూర్ పరిధిలోని బండ్లగూడ, గంధంగూడ, పేట్‌బషీరాబాద్, జల్‌పల్లి/లక్ష్మిగూడ ప్రాంతాల్లో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక్కో ప్రాంతంలో 500 ఫ్లాట్ల చొప్పున మొత్తం 2,000 ఆధునిక ఫ్లాట్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.220 కోట్ల అంచనా వ్యయం అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఈ పథకం ప్రత్యేకంగా ఆటోరిక్షా కార్మికుల కోసమే రూపొందించామని, ఇళ్ల కేటాయింపు, ఆర్థిక సహాయం, అర్హత ప్రమాణాలు తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు–టవర్స్ పథక నిబంధనలే వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ఆటో కార్మికులకు పారదర్శకంగా ఇళ్లను కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థలాల లభ్యత, సాంకేతిక అంశాలు, భౌగోళిక అనుకూలతలను క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించడంతో పాటు ఆర్థిక ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేసి అర్హులైన ఆటో కార్మిక కుటుంబాలకు వీలైనంత త్వరగా గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
సంబంధిత వార్తలు

Naaz Anjum Hyderabad | రూ.80 పెట్టుబడితో మొదలై నెలకు రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్ ‘బిర్యానీ క్వీన్’ నాజ్ అంజుమ్ సక్సెస్ స్టోరీ!
నవంబర్ 14, 2026

Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్
నవంబర్ 14, 2026

Cinematica Expo 2026 | హైదరాబాద్ టీ-హబ్‌లో ‘సినిమాటికా ఎక్స్పో 2026’.. సినిమా, AI, గేమింగ్ క్రియేటర్లకు గోల్డెన్ ఛాన్స్
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!



