త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | నల్లాల‌కు అక్రమ మోటార్లు బిగిస్తున్నారా..? చర్య‌లు త‌ప్ప‌వ‌న్న జల‌మండలి

HMWSSB | జీహెచ్ఎంసీతో పాటు ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో జ‌ల‌మండ‌లి తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే చాలా మంది వినియోగ‌దారులు న‌ల్లాల‌కు అక్ర‌మ మోటార్లు బిగిస్తూ.. మోతాదుకు మించి నీటిని తోడేస్తున్నారు.

S

Hyderabad | Published On Apr 8, 2026, 4.30 pm IST

HMWSSB | నల్లాల‌కు అక్రమ మోటార్లు బిగిస్తున్నారా..? చర్య‌లు త‌ప్ప‌వ‌న్న జల‌మండలి
Advertisement

HMWSSB | త్రినేత్ర‌.న్యూస్ : జీహెచ్ఎంసీతో పాటు ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో జ‌ల‌మండ‌లి తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే చాలా మంది వినియోగ‌దారులు న‌ల్లాల‌కు అక్ర‌మ మోటార్లు బిగిస్తూ.. మోతాదుకు మించి నీటిని తోడేస్తున్నారు. మిగ‌తా వినియోగ‌దారుల‌కు లో ప్రెజ‌ర్‌తో నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంది. ఇలా న‌ల్లాల‌కు అక్ర‌మంగా మోటార్లు వినియోగించే వారిపై చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌ల‌మండ‌లి హెచ్చ‌రించింది.

ఎస్ఆర్ న‌గ‌ర్ ప‌రిధిలోని ఓ అండ్ ఎం డివిజ‌న్ నంబ‌ర్ -6లో న‌ల్లాకు అక్ర‌మంగా మోటార్లు బిగిస్తున్నార‌ని స్థానికులు జ‌ల‌మండ‌లి విజిలెన్స్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. దీంతో త‌నిఖీలు నిర్వ‌హించి.. అక్ర‌మంగా బిగించిన ఏడు మోటార్ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.

ఒకవేళ తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తారు.

Advertisement
Advertisement