త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైద‌రాబాద్‌లో అర్ధ‌రాత్రి భారీ వ‌ర్షం.. చ‌ల్ల‌బ‌డిన వాతావ‌ర‌ణం

Hyderabad | హైద‌రాబాద్‌లో (Hyderabad) అర్ధ‌రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఒంటి గంట నుంచి 2 గంట‌ల స‌మ‌యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన‌ వాన దంచికొట్టింది (Heavy Rain). దీంతో రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

G

Hyderabad | Published On Mar 18, 2026, 7.51 am IST

Hyderabad | హైద‌రాబాద్‌లో అర్ధ‌రాత్రి భారీ వ‌ర్షం.. చ‌ల్ల‌బ‌డిన వాతావ‌ర‌ణం
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) అర్ధ‌రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఒంటి గంట నుంచి 2 గంట‌ల స‌మ‌యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన‌ వాన దంచికొట్టింది (Heavy Rain). దీంతో రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. మంగ‌వారం రోజంతా సూర్యుడి ప్ర‌తాపం చూపించ‌డంతో వేడి, ఉక్క‌పోత‌తో ఇబ్బంది ప‌డిన న‌గ‌ర‌వాసుల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. రాత్రి కురిసిన వాన‌తో ప్ర‌స్తుతం ఆకాశం మేఘావృత‌మై ఉంది. దీంతో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారిపోయింది.

ఎల్‌బీ న‌గ‌ర్, స‌రూర్ న‌గ‌ర్, వ‌న‌స్థ‌లిపురం, దిల్‌సుఖ్‌న‌గ‌ర్, సంతోష్‌న‌గ‌ర్, చాద‌ర్‌ఘాట్, కోఠి, న‌ల్ల‌కుంట‌, రాంన‌గ‌ర్, తార్నాక‌, హ‌బ్సిగూడ‌, సికింద్రాబాద్, ఖైర‌తాబాద్, బేగంపేట్, పంజాగుట్ట‌, సోమాజిగూడ‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, చింతల్‌, రహమత్ నగర్, యూసుఫ్ గూడ, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, హైదర్‌నగర్, ప్రగతినగర్, బాచుపల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపుర్, రాయదుర్గం, షాపూర్‌, జీడిమెట్ల, మెహిదీప‌ట్నం, మ‌హేశ్వ‌రం, శంషాబాద్, రాజేంద్ర‌న‌గ‌ర్, బండ్ల‌గూడ జాగీర్, బ‌హ‌దూర్‌పురా, కార్వాన్, కాటేదాన్, బార్క‌స్, చాంద్ర‌య‌ణ‌గుట్ట‌, చార్మినార్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఇక జిల్లాల్లోనూ అక్క‌డ‌క్క‌డా వాన ప‌డింది. రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వికారాబాద్, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల‌, నాగ‌ర్‌క‌ర్నూల్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వ‌ర్షం కురిసింది. ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు వ‌ర్షాలు కొన‌సాగే అవ‌కాశం ఉంది.

https://x.com/balaji25_t/status/2033995879368331447

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement