Tappachabutra Police | కరెంటు షాక్‌తో పడిపోయాడు.. పోలీసులొచ్చి సీపీఆర్ చేశారు.. తర్వాత ఏమైందంటే!
Tappachabutra Police | కరెంటు షాక్‌తో పడిపోయిన విద్యుత్ కార్మికుడికి సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడిన స్ఫూర్తిదాయక ఘటన ఇది. కార్వాన్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు నిర్వహిస్తున్న రాజు నాయక్ అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురవడంతో టప్పాచబుత్రా పోలీస్ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు నిలబెట్టారు.
త్రినేత్ర.న్యూస్: కరెంటు షాక్‌తో పడిపోయిన విద్యుత్ కార్మికుడికి సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడిన స్ఫూర్తిదాయక ఘటన ఇది. కార్వాన్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు నిర్వహిస్తున్న రాజు నాయక్ అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురవడంతో టప్పాచబుత్రా పోలీస్ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు నిలబెట్టారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని మెచ్చుకొని పలువురు ప్రసంశల జల్లు కురిపించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
కార్వాన్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్ కార్వాన్ ప్రాంతంలోని కుమ్మరవాడి హనుమాన్ దేవాలయం సమీపంలో ఓ విద్యుత్ స్తంభంపై గురువారం మరమ్మతు పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ప్రమాదవశాత్తు లైవ్ హై-టెన్షన్ వైర్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్తంభం పైనుండి కిందకు పడిపోవడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో సమీపంలోనే 'బ్లూ కోల్ట్స్-I' (BC-I) గస్తీ విధుల్లో ఉన్న టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి. సురేష్ గమనించాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సీపీఆర్ ప్రక్రియను ప్రారంభించారు.
నిలకడగా ఆరోగ్యం..
కానిస్టేబుల్ సురేష్ బాధితుడి ఛాతిపై ఒత్తిడి (Chest Compressions) తీసుకురావడంతో కొద్దిసేపటికే రాజు నాయక్ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించారు. అనంతరం స్థానికుల సహాయంతో బాధితుడిని మెరుగైన వైద్యం కోసం అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు విద్యుత్ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే 'గోల్డెన్ అవర్'లో పోలీస్ అధికారి సకాలంలో స్పందించి సీపీఆర్ అందించడం వల్లే ప్రాణాపాయం తప్పిందని వైద్యులు కొనియాడారు.
కానిస్టేబుల్ బి.సురేష్ ను టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి. బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. సమాజ రక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని.. ఈ ఘటన మరోసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Pinarayi Vijayan ED Raids | పినరయి విజయన్‌పై ఈడీ ఫోకస్ వెనుక అసలు కథ ఇదేనా? కాంగ్రెస్, బీజేపీలపై సీపీఎం సంచలన ఆరోపణలు!
మే 28, 2026

Gandhi IVF Centre | గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో ‘బాలభీముడు’
మే 28, 2026

Ghoshamahal Police | మానవత్వంతో స్పందించారు.. దివ్యాంగురాలిని రక్షించి అప్పగించారు..
మే 28, 2026
తాజావార్తలు
- ●Kanchi Varadaraja Swamy Temple | కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు: ఆ 'గరుడ సేవ'ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. పునర్జన్మ ఉండదట!
- ●Vijay Deverakonda | రష్మికపై కొండంత ప్రేమను చాటుకున్న విజయ్ - పెళ్లైనే తగ్గేదేలే
- ●KTR | ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది! : కేటీఆర్
- ●Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..
- ●Thirunallar Saneeswara Temple | తిరునల్లార్ శనీశ్వరుని 'స్వర్ణ కాకి వాహనసేవ': ఏలినాటి శని దోషాలు పోవాలంటే దీని విశిష్టత తెలుసుకోండి!
- ●Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశా : సిద్ధరామయ్య

Kanchi Varadaraja Swamy Temple | కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు: ఆ 'గరుడ సేవ'ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. పునర్జన్మ ఉండదట!

Vijay Deverakonda | రష్మికపై కొండంత ప్రేమను చాటుకున్న విజయ్ - పెళ్లైనే తగ్గేదేలే

KTR | ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది! : కేటీఆర్

Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..



