త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేర‌కే రాజీనామా చేశా : సిద్ధ‌రామ‌య్య‌

Siddaramaiah | అధిష్టానం ఆదేశాల (Congress high command) మేర‌కే తాను రాజీనామా చేసిన‌ట్లు సిద్ధ‌రామ‌య్య (Siddaramaiah) చెప్పారు. గ‌వ‌ర్న‌ర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో సెక్ర‌ట‌రీకి రాజీనామా లేఖ‌ను అంద‌జేసిన‌ట్లు తెలిపారు. ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించినా స్వీక‌రిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా సిద్ధ‌రామ‌య్య స్ప‌ష్టం చేశారు.

D

National | Published On May 28, 2026, 3.43 pm IST

Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేర‌కే రాజీనామా చేశా : సిద్ధ‌రామ‌య్య‌
Advertisement

Siddaramaiah | క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య (Siddaramaiah) రాజీనామా చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం లోక్‌భ‌వ‌న్‌కు వెళ్లి రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అధిష్టానం ఆదేశాల (Congress high command) మేర‌కే తాను రాజీనామా చేసిన‌ట్లు చెప్పారు. గ‌వ‌ర్న‌ర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో సెక్ర‌ట‌రీకి రాజీనామా లేఖ‌ను అంద‌జేసిన‌ట్లు తెలిపారు.

లోక్‌భ‌వ‌న్‌లో సిద్ధ‌రామ‌య్య మీడియాతో మాట్లాడుతూ.. “అధిష్టానం నన్ను రాజీనామా చేయమని కోరినప్పుడు నేను రాజీనామా చేస్తానని మీ అందరికీ ఇంత‌కుముందు చాలాసార్లు చెప్పాను. రెండు రోజుల క్రితం నన్ను పదవి నుంచి తప్పుకోవాలని అధిష్టానం కోరింది. నేను ఈ రోజు రాజీనామా చేస్తానని వారికి చెప్పాను. ఆ మాట‌కు క‌ట్టుబ‌డి నేను రాజీనామా చేశాను. గ‌వ‌ర్న‌ర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆయ‌న కార్యాల‌యానికి రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించాను. గ‌వ‌ర్న‌ర్ వ‌చ్చాక దాన్ని ఆమోదిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. ఆ త‌ర్వాత కొత్త సీఎం ప్ర‌మాణ‌స్వీకారం ఉంటుంది” అని సిద్ధరామయ్య తెలిపారు.

ఏ బాధ్య‌త అప్ప‌గించినా స్వీక‌రిస్తా..

పార్టీతో త‌న‌కున్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా సిద్ధ‌రామ‌య్య గుర్తు చేసుకున్నారు. తాను 2006లో కార్య‌క‌ర్త‌గా పార్టీలో చేరిన‌ట్లు చెప్పారు. ఎప్పుడూ సీఎం అవుతాన‌ని అనుకోలేద‌న్నారు. పెద్ద పెద్ద ప‌ద‌వులు చేప‌ట్టాల‌న్న ఆశ లేద‌న్నారు. ఈ జ‌ర్నీలో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు అంద‌రూ త‌న‌కు ఎంతో మ‌ద్ద‌తు ఇచ్చార‌న్నారు. వారంద‌రికీ ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. "రాజ్యాంగమే మా ధర్మం.. ఓటర్లే మా దేవుళ్లు" అని చెప్పారు. త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గేల‌కు సిద్ధూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అధిష్టానం ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించినా స్వీక‌రిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా సిద్ధ‌రామ‌య్య స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement