Kanchi Varadaraja Swamy Temple | కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు: ఆ ‘గరుడ సేవ’ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. పునర్జన్మ ఉండదట!
కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇందులో మూడో రోజు జరిగే 'గరుడ సేవ'ను దర్శించుకుంటే పాపాలు తొలగి, పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం.
Devotional | Published On May 28, 2026, 4.10 pm IST
Kanchi Varadaraja Swamy Temple | త్రినేత్ర.న్యూస్ : కాంచీపురం (Kanchipuram) అనగానే ముందుగా గుర్తొచ్చేది అద్భుతమైన ఆలయాలు. అందులో విష్ణుకంచిగా పిలిచే సుప్రసిద్ధ శ్రీ వరదరాజస్వామి (Varadaraja Swamy) ఆలయంలో ప్రతి ఏటా వైశాఖ మాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. తమిళ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా నిర్వహించే ఈ వేడుకలకు, స్వామివారి ఆశీస్సులు పొందేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. మే 25న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు.. జూన్ 6 వరకు కొనసాగనున్నాయి.
వెరైటీ వాహన సేవలు.. రథోత్సవం
ఈ పది రోజుల ఉత్సవాల్లో శ్రీమహావిష్ణువు రోజూ వేర్వేరు వాహనాలపై (Vahana Sevas) భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా ఉత్సవాల్లో 7వ రోజు జరిగే రథోత్సవం (Rathotsavam) ఒక కన్నుల పండువలా ఉంటుంది. అలంకరించిన భారీ రథంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగించే అద్భుత ఘట్టాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు.
గరుడ సేవకే ఎందుకంత స్పెషల్?
వందలాది వాహన సేవలు ఉన్నప్పటికీ, ఈ బ్రహ్మోత్సవాల్లో అన్నిటికంటే అత్యంత స్పెషల్ అట్రాక్షన్ 'గరుడ సేవ' (Garuda Seva). మూడో రోజు ఉదయం జరిగే ఈ సేవకు ఉండే ప్రాముఖ్యత మరెక్కడా కనిపించదు. కంచిలో గరుడ వాహనం చాలా పెద్దదిగా, ఎంతో గంభీరంగా ఉంటుంది. గరుత్మంతుడు తన భారీ రెక్కలు విప్పుకుని విష్ణుమూర్తిని మోస్తున్నట్లుగా ఉండే ఆ రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ విజువల్ ట్రీట్ (Visual treat) కనులారా చూసేందుకు తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.
పాపాలు తొలగిపోయే పుణ్య ఘడియలు
రెక్కలు విప్పుకున్న ఆ గరుడ వాహనంపై వరదరాజస్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని, గతంలో చేసిన పాపాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఏటా జరిగే ఈ వేడుక కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో కంచిని సందర్శించడం జీవితంలో ఒక మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..
- ●Thirunallar Saneeswara Temple | తిరునల్లార్ శనీశ్వరుని 'స్వర్ణ కాకి వాహనసేవ': ఏలినాటి శని దోషాలు పోవాలంటే దీని విశిష్టత తెలుసుకోండి!
- ●Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశా : సిద్ధరామయ్య
- ●Smart Phones | ఫోన్ మరీ అతిగా హీట్ అవుతుందా.. వేసవిలో ఫోన్ పట్ల ఈ జాగ్రత్తలు పాటించండి..
- ●N Ramachander Rao | తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం : ఎన్ రామచందర్ రావు
- ●Tappachabutra Police | కరెంటు షాక్తో పడిపోయాడు.. పోలీసులొచ్చి సీపీఆర్ చేశారు.. తర్వాత ఏమైందంటే!

Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..

Thirunallar Saneeswara Temple | తిరునల్లార్ శనీశ్వరుని 'స్వర్ణ కాకి వాహనసేవ': ఏలినాటి శని దోషాలు పోవాలంటే దీని విశిష్టత తెలుసుకోండి!

Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశా : సిద్ధరామయ్య

Smart Phones | ఫోన్ మరీ అతిగా హీట్ అవుతుందా.. వేసవిలో ఫోన్ పట్ల ఈ జాగ్రత్తలు పాటించండి..





