Hash oil | విలాసాల కోసం హ్యాష్ ఆయిల్ విక్రయం.. ముగ్గురు అరెస్ట్
Hash oil | ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఓ ఇద్దరు యువకులు అక్రమ సంపాదనకు తెరలేపారు. నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తూ విలాస జీవితానికి అలవాటు పడ్డారు. అయితే మత్తు పదార్థాలను విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
Hash oil | త్రినేత్ర.న్యూస్ : ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఓ ఇద్దరు యువకులు అక్రమ సంపాదనకు తెరలేపారు. నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తూ విలాస జీవితానికి అలవాటు పడ్డారు. అయితే మత్తు పదార్థాలను విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1,02,500 విలువైన హ్యాస్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ కిస్మత్‌పూర్‌కు చెందిన శంకరుల్ల అఖిల్(30) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ ఇబ్బందులను ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి సారించాడు. హైదరాబాద్ నగరంలో హ్యాస్ ఆయిల్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని గ్రహించాడు. దీంతో ఆ మత్తు పదార్థంపై శోధించి విశాఖపట్టణం వెళ్లాడు. ఇక అక్కడ్నుంచి అక్రమంగా హ్యాస్ ఆయిల్‌ను తరలిస్తూ నగరంలో విక్రయించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో రహమత్‌నగర్‌కు చెందిన పోఖ్రేల్ సందీప్(25), వెంటకగిరి వాసి షేక్ అన్వర్(28) పరిచయం అయ్యారు. వీరితో పాటు మరికొందరికి హ్యాస్ ఆయిల్ విక్రయిస్తూ లాభాల ఆర్జించాడు. దీంతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు.
అయితే హ్యాస్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో దాడులో నిర్వహించి ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 45 సీసాల హ్యాస్ ఆయిల్ (ప్రతి సీసా పరిమాణం 5 మి.లీ.), సుమారు 185 గ్రాముల విడిగా ఉన్న హ్యాస్ ఆయిల్, మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1,02,500 ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ ఆపరేషన్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ యదేందర్, జుబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐజీ సందీప్ రెడ్డి, వారి సిబ్బంది, జుబ్లీహిల్స్ పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించబడింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





