Haleem | హలీం ప్రియులకు అలర్ట్.. ఈసారి కొండెక్కనున్న హలీం ధరలు..!
Haleem | రంజాన్ పర్వదినం నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా గల్లీ గల్లీకో హలీం బట్టి దర్శనమిస్తోంది. హలీం రుచిని చూసేందుకు హైదరాబాదీలు కూడా ఆత్రుత పడుతున్నారు. రకరకాల హలీంలను ఆరగించి.. ఆ రుచిని ఆస్వాదించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే హలీం ధరలు ఈ సారి కొండెక్కనున్నాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ప్లేట్ హలీంపై రూ. 10 నుంచి రూ. 15కు పెంపు
Haleem | త్రినేత్ర.న్యూస్ : రంజాన్ పర్వదినం నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా గల్లీ గల్లీకో హలీం బట్టి దర్శనమిస్తోంది. హలీం రుచిని చూసేందుకు హైదరాబాదీలు కూడా ఆత్రుత పడుతున్నారు. రకరకాల హలీంలను ఆరగించి.. ఆ రుచిని ఆస్వాదించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే హలీం ధరలు ఈ సారి కొండెక్కనున్నాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అంటే భారీ మొత్తంలో ధరలు పెరగనప్పటకీ, కాస్త స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
గతేడాది ప్లేట్ హలీంను రూ. 250 నుంచి రూ. 280 వరకు విక్రయించారు. అయితే ఈ ధర ఆయా రెస్టారెంట్లలో కూడా వ్యత్యాసంగా ఉంది. పేరొందిన రెస్టారెంట్లలో రూ. 300 దాకా కూడా విక్రయించారు. ఈ ఏడాది ఈ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని, ఆయా రెస్టారెంట్ల మధ్య ధరల తేడాల్లో వ్యత్యాసం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈసారి ఒక్కో ప్లేట్‌పై రూ. 10 నుంచి రూ. 15 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. మాంసం, నెయ్యి ధరలు కూడా ఆకాశాన్నాంటాయి. ఈ నేపథ్యంలోనే హలీం ధరలు కూడా పెంచాల్సి వస్తుందన్నారు.
పిస్తా హౌజ్, షాగౌస్ రెస్టారెంట్, కేఫ్ 555, బహార్ కేఫ్, సర్వీ, మెహ్‌ఫీల్, మదీనా హోటల్, షాదాబ్ వంటి రెస్టారెంట్లలో రుచికరమైన హలీం లభిస్తుంది. ఈ రెస్టారెంట్లలో ప్లేట్ హలీం ధర రూ. 300 వరకు ఉండొచ్చని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక నాగారం, కీసర, కుషాయిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, బొంగులూరు, తుర్కయాంజల్, కొంపల్లి, నానక్‌రాంగూడ, చందానగర్ వంటి ఏరియాల్లో కొత్త అవుట్‌లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయా రెస్టారెంట్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్





