GHMC Mayor | ఇదే నా చివరి మీటింగ్.. జీహెచ్ఎంసీ మేయర్ ఎమోషనల్ స్పీచ్
GHMC Mayor | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భావోద్వేగానికి లోనయ్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇదే నా చివరి మీటింగ్ అని పేర్కొన్నారు.
GHMC Mayor | త్రినేత్ర.న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భావోద్వేగానికి లోనయ్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇదే నా చివరి మీటింగ్ అని పేర్కొన్నారు. పదవిలో లేకున్నా హైదరాబాద్ పట్ల తనకున్న ప్రేమ, బాధ్యత, నిబద్ధత కొనసాగుతుందని మేయర్ తెలిపారు.
శనివారం ఉదయం 10:30 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. చివరి రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా సాగింది. సభ్యుల ఆందోళనల మధ్య రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 9200 కోట్ల బడ్జెట్ ఉండగా.. కొత్తగా విలీనమైన 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ. 2260 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 వార్డులను దృష్టిలో ఉంచుకుని 2026-27 బడ్జెట్ రూపకల్పన చేశారు.
ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీ కాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. అయితే ఫిబ్రవరి 11 నుంచి జీహెచ్‌ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ సర్కార్ ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన చివరి కౌన్సిల్ సమావేశంలో ఉద్విగ్నపూరిత వాతావరణం చోటు చేసుకుంది.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026

Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



