త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Holiday | ఈ నెల 25న గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం.. ఈ జిల్లాల్లో సెల‌వు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

Holiday | గణేశ్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ శుక్రవారం సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఈ సెలవు వర్తించనుంది.

P

Hyderabad | Published On Sep 23, 2026, 6.33 pm IST

Holiday | ఈ నెల 25న గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం.. ఈ జిల్లాల్లో సెల‌వు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం
Advertisement

Holiday | గణేశ్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ శుక్రవారం సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గణేశ్‌ నిమజ్జన ఊరేగింపులు, భారీగా తరలివచ్చే భక్తులు, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్‌ 25న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉండ‌నుంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లోని సంబంధిత సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. సెప్టెంబర్‌ 25న ప్రకటించిన సెలవుకు బదులుగా నవంబర్‌ 14 (రెండో శనివారం)ను పనిదినంగా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సెప్టెంబర్‌ 25న సెలవు పొందే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు య‌థావిధిగా నవంబర్‌ 14న పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 2025 డిసెంబర్‌ 6న జారీ చేసిన సెలవుల ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ ప్రభుత్వం తాజాగా జీఓఆర్టీ నంబర్‌ 1396ను విడుదల చేసింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement