Ground Water Levels | తెలంగాణలో భూగర్భ జల సంక్షోభం.. 554 మండలాల్లో పడిపోయిన నీటిమట్టాలు
Ground Water Levels | తెలంగాణ తీవ్రమైన భూగర్భ జల సంక్షోభాన్ని ఎదుర్కోంటుంది. భూగర్భ జలాలు(Ground Water Levels ) అడుగంటి పోతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని మొత్తం 621 మండలాలకు గానూ 554 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఆందోళనకరం
జోగులాంబ జిల్లాలో అత్యధికంగా లోటు వర్షపాతం
ఎండిపోతున్న బోరు బావులు
Ground Water Levels | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ తీవ్రమైన భూగర్భ జల సంక్షోభాన్ని ఎదుర్కోంటుంది. భూగర్భ జలాలు(Ground Water Levels ) అడుగంటి పోతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని మొత్తం 621 మండలాలకు గానూ 554 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. గత పదేళ్లలో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్న ప్రాంతం నాలుగు రెట్లకు పైగా విస్తరించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నగర పరిధిలో సగటు భూగర్భ జలమట్టాలు కేవలం ఏడాది కాలంలోనే 7.17 మీటర్లు పడిపోయాయి. నగరంలోనే ఈ పరిస్థితి ఉంటే.. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తాగు, సాగునీటి సంక్షోభం ఎంత ఉందో స్ఫష్టమవుతుంది.

తెలంగాణ భూగర్భ జలాల శాఖ అక్టోబర్ నివేదిక ప్రకారం, రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం భూమికి దిగువన 7.77 మీటర్ల లోతులో ఉంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 2 మీటర్ల క్షీణతను సూచిస్తోంది. 2016-2025 మధ్య కాలంలో అక్టోబర్ నెలల్లో సగటుతో పోలిస్తే, 20 మీటర్ల కంటే తక్కువకు పడిపోయాయి. ఈ విస్తీర్ణం 478 చదరపు కిలోమీటర్ల నుండి 2,040 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. మొత్తంగా 89 శాతం మండలాల్లో పదేండ్ల సగటుతో పోల్చితే భూగర్భ జల మట్టాలు తగ్గుముఖం పట్టాయి.
22 జిల్లాల్లో భారీగా లోటు వర్షపాతం
ఇందుకు లోటు వర్షపాతమే కారణం అని భూగర్భ జల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు 628 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో సాధారణ వర్షపాతం 831 మి.మీ. అంటే 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 33 జిల్లాలకు గానూ 11 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగతా 22 జిల్లాల్లో భారీగా లోటు వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నారాయణపేట జిల్లాలో 44 శాతం, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 42 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా తగ్గిన నీటిమట్టాలు
తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా ఏడాది కాలంలో 6.05 మీటర్ల మేర భూగర్భ జల మట్టం తగ్గింది. ఆ తర్వాతి స్థానాల్లో వికారాబాద్ (5.39 మీటర్లు), నారాయణపేట (5.25 మీటర్లు), మహబూబ్‌నగర్ (5.01 మీటర్లు), మేడ్చల్-మల్కాజ్‌గిరి (4.99 మీటర్లు) జిల్లాలు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ప్రస్తుత భూగర్భ జల మట్టం 12.80 మీటర్లు, మెదక్‌లో 12.44 మీటర్లు, రంగారెడ్డిలో 11.90 మీటర్లు, వికారాబాద్‌లో 11.87 మీటర్లు, సంగారెడ్డిలో 11.76 మీటర్లుగా ఉంది.
హైదరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరం
హైదరాబాద్ జిల్లాలో గతేడాది భూగర్భ జలమట్టాలు 6.12 మీటర్ల లోతులో ఉంటే.. ఈ ఏడాది సగటున 10.62 మీటర్ల లోతుకు చేరాయి. ఇది 4.50 మీటర్ల తగ్గుదల. ఈ ప్రాంతంలో సాధారణంగా కురవాల్సిన 729 మిల్లీమీటర్లకు బదులుగా 484 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది 34 శాతం తక్కువ అని అధికారులు పేర్కొన్నారు.
కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల్లో కూడా
ఈ భూగర్భ జలమట్టాల క్షీణత కేవలం మూసీ నది పరివాహక ప్రాంతానికో లేదా పట్టణ ప్రాంతాలకో పరిమితం కాలేదు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల్లో కూడా భూగర్భ జలాలు పడిపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జలాశయాలలో నీటి నిల్వలు తగ్గడం, చెరువులు, సాగునీటి వ్యవస్థల ద్వారా భూగర్భ జలాలు పునరుద్ధరణ కాకపోవడం ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఉపరితల నీటి లభ్యత తగ్గడంతో, రైతులు బోరుబావులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరుకుంటున్నాయి. ఉన్న బోరుబావులు ఎండిపోవడంతో కొత్త బోర్టు వేయడం కూడా ఆందోళన కలిగిస్తోంది. రాబోయే వేసవి కాలంలో తాగునీరు, సాగునీటి అవసరాలు పెరగనున్న నేపథ్యంలో, ఇప్పటికే అడుగంటిన భూగర్భ జల నిల్వలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు
నవంబర్ 4, 2026

Medigadda To Kondapochamma Sagar Cycle Yatra | కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. మేడిగడ్డ టు ఎర్రవెల్లి 400 కి.మీ సైకిల్ యాత్ర
నవంబర్ 4, 2026

Hyderabad Water Tanker Strike Called Off | సిటీ బోర్లలో నీళ్లు ఎందుకు ఇంకిపోతున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే?
నవంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Metro - RTC Pass | రూ. 325కే మెట్రో - ఆర్టీసీ డే పాస్.. మంత్లీ పాస్ రూ. 4 వేలు..!
- ●Horoscope | నవంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి..!
- ●Athulya Ravi | చూపు తిప్పుకోనివ్వని అందం.. రెడ్ డ్రెస్‌లో గులాబీలా అతుల్యా!
- ●Manushi Chhillar | ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ కానక్కర్లేదు.. లక్ష్యానికి చేరువ చేస్తే చాలంటోన్న మానుషి!
- ●Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు
- ●US Midterm Elections 2026 | ట్రంప్‌నకు అసలు షాక్ ఇప్పుడే.. అమెరికాలో మారిన పవర్ గేమ్..!

Metro - RTC Pass | రూ. 325కే మెట్రో - ఆర్టీసీ డే పాస్.. మంత్లీ పాస్ రూ. 4 వేలు..!

Horoscope | నవంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి..!

Athulya Ravi | చూపు తిప్పుకోనివ్వని అందం.. రెడ్ డ్రెస్‌లో గులాబీలా అతుల్యా!

Manushi Chhillar | ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ కానక్కర్లేదు.. లక్ష్యానికి చేరువ చేస్తే చాలంటోన్న మానుషి!



