త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | హైద‌రాబాద్‌లో 36 గంట‌ల పాటు తాగునీటి స‌ర‌ఫ‌రా బంద్

HMWSSB | హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్. నేటి నుంచి రాబోయే 36 గంట‌ల పాటు తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని జ‌ల‌మండ‌లి( HMWSSB ) ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని సూచించింది.

S

Hyderabad | Published On Nov 3, 2026, 9.05 am IST

HMWSSB | హైద‌రాబాద్‌లో 36 గంట‌ల పాటు తాగునీటి స‌ర‌ఫ‌రా బంద్
Advertisement

HMWSSB | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్. నేటి నుంచి రాబోయే 36 గంట‌ల పాటు తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని జ‌ల‌మండ‌లి( HMWSSB ) ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని సూచించింది. న‌వంబ‌ర్ 3న‌ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4 సాయంత్రం 6 గంటల వరకు మరమ్మతు పనుల జరుగనున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది.

గండిపేట నుంచి తాగునీటి లీకేజీలు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. రాతి కాలువ ద్వారా గండిపేట నుంచి 20 ఎంజీడీల నీరు నగరంలోని వివిధ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సరఫరా అవుతోంది. వందేళ్లకుపైగా పురాతన కాలువ కావడంతో చాలా చోట్ల లీకేజీల కారణంగా భారీగా నీరు వృథా అవుతోంది. దీంతో మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. తాజాగా సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద భారీగా లీకేజీలు ఏర్పడ్డాయి. వాటిని అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టనుంది. ఈ కారణంగా రేపటి నుంచి 36 గంటలపాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది.

ట్యాగ్స్:

Drinking WaterGandipetaHMWSSBHyderabadJalamandali
Advertisement
Advertisement