త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nalsar University | న‌ల్సార్ విశ్వ‌విద్యాల‌యంలో గంజాయి క‌ల‌క‌లం..

Nalsar University | అది జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న విశ్వ‌విద్యాల‌యం. న్యాయ శాస్త్ర కోవిదులుగా విద్యార్థుల‌ను తీర్చిదిద్దేందుకు ఆ వ‌ర్సిటీని (Law University) నెల‌కొల్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందినవారు అక్క‌డ విద్య‌ను అభ్య‌సిస్తుంటారు. ఉన్న‌తాశ‌యంలో 30 ఏండ్ల క్రితం ఏర్పాటుచేసిన ఈ వ‌ర్సిటీలో ఇప్పుడు గంజాయి (Ganja) క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది.

G

Hyderabad | Published On Mar 29, 2026, 8.51 am IST

Nalsar University | న‌ల్సార్ విశ్వ‌విద్యాల‌యంలో గంజాయి క‌ల‌క‌లం..
Advertisement

Nalsar University | త్రినేత్ర‌.న్యూస్‌: అది జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న విశ్వ‌విద్యాల‌యం. న్యాయ శాస్త్ర కోవిదులుగా విద్యార్థుల‌ను తీర్చిదిద్దేందుకు ఆ వ‌ర్సిటీని (Law University) నెల‌కొల్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందినవారు అక్క‌డ విద్య‌ను అభ్య‌సిస్తుంటారు. ఉన్న‌తాశ‌యంలో 30 ఏండ్ల క్రితం ఏర్పాటుచేసిన ఈ వ‌ర్సిటీలో ఇప్పుడు గంజాయి (Ganja) క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. మ‌త్తు ప‌దార్థాల‌కు బానిస‌ల‌వుతూ విద్యార్థులు త‌మ బంగారు భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకుంటున్నారు.

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని నల్సార్‌ విశ్వవిద్యాలయానికి (Nalsar University) చెందిన‌ విద్యార్థులు కొంత కాలంగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండేండ్లుగా ఇక్క‌డి విద్యార్థులు గ‌జాయికి బానిస‌ల‌వుతున్నార‌ని తెలిపారు. గ‌త నెల శామీర్‌పేటలో జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంతో ఈవిష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రోజూ రాత్రి 10 గంటల తర్వాత విద్యార్థులు వర్సిటీ నుంచి బయటకు వెళ్తున్నారని తెలిసింది. ఫిబ్రవరి 21న రాత్రి వర్సిటీకి చెందిన విద్యార్థులు ప్రియాన్ష్‌ కుమార్‌ మీనా, సాక్షం, గోపిచంద్‌ బయటకు వెళ్లి గంజాయితో పాటు ఇతర మతు పదార్థాలు సేవించారు. రాత్రి 11గంటల సమయంలో బైక్‌పై ముగ్గురు విద్యార్థులు తిరిగి వర్సిటీకి వస్తుండగా పెద్దమ్మ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

దీంతో సాక్షం అనే విద్యార్థి అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా, మిగిలిన ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘటనపై వర్సిటీ ప్రొఫెసర్‌ మల్లికార్జున్‌ శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విద్యార్థులు గంజాయి సేవించినట్లు ఈగల్‌ టీమ్‌ అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు విద్యార్థులు ద్రిషక్‌రాజ్‌, నిధాన్‌, దేశ్‌ పాండే, గోపిచంద్‌, ప్రియాన్ష్‌ కుమార్‌, సాక్షం కలిసి రెండు బైక్‌లపై వర్సిటీ నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది. వారికి డ్రగ్స్‌ టెస్టు చేయగా ద్రిషక్‌రాజ్‌కు పాజిటివ్‌ వచ్చింది. అత‌డిని విచారించ‌గా.. 2024 నుంచి గంజాయి సేవిస్తున్నట్లు చెప్పాడు. మరో విద్యార్థి రుషి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు వెల్ల‌డించాడు. తన మిత్రులు అభిషేక్‌, ఆర్యన్‌, ప్రభు కూడా గంజాయి సేవిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఆ నలుగురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement