Hyderabad | యువకుడికి గుండు గీయించి.. నగ్నంగా డ్యాన్స్ చేయించారు..
Hyderabad | కారు కిరాయి, మరమ్మతులకు డబ్బు చెల్లించలేదని ఓ యువకుడిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతనికి గుండు గీయించి, నగ్నంగా డ్యాన్సులు (Nude Dance) చేయించారు.
Hyderabad | త్రినేత్ర న్యూస్: కారు కిరాయి, మరమ్మతులకు డబ్బు చెల్లించలేదని ఓ యువకుడిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతనికి గుండు గీయించి, నగ్నంగా డ్యాన్సులు (Nude Dance) చేయించారు. హైదరాబాద్‌లోని (Hyderabad) గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో (Golconda) చోటుచేసుకున్న ఈ దారుణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అల్కాపూర్‌కు చెందిన మాలిక్ అనే వ్యక్తి నౌమాన్ వద్ద కమీషన్ ప్రాతిపదికన కారు తీసుకుని కిరాయికి (Rental Car) ఇస్తుంటాడు. ఇందులో భాగంగా ఆరు నెలల క్రితం గుడిమల్కాపూర్‌కు చెందిన అర్బాజ్ అనే యువకుడికి మాలిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును (Self Drive Car) రెంట్‌కి ఇచ్చాడు. అయితే కారును నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ దానికి గీతలు పడటంతో వివాదం చెలరేగింది. కిరాయి డబ్బులతోపాటు మరమ్మతుల నిమిత్తం రూ.40 వేలు ఇవ్వాలని మాలిక్ డిమాండ్ చేశాడు. దీంతో అర్బాజ్ కొంత మొత్తం చెల్లించినప్పటికీ, మిగిలిన డబ్బులు ఇవ్వలేకపోయాడు.
దీంతో రెండు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి అర్బాజ్‌ను గుల్షన్ కాలనీలోని ఓ ఇంటికి తీసుకెళ్లిన మాలిక్.. అతడిని విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం ఆ యువకుడికి గుండు గీయించారు. బట్టలు విప్పించి నగ్నంగా నృత్యం చేయిస్తూ వీడియోలు తీశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన గోల్కొండ పోలీసులు.. మాలిక్‌తోపాటు అతని స్నేహితులు ముస్తఫా, ఖుర్రం, మాజ్, ఫర్దీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Safety Advisory | ఫ్రాన్స్‌లో అల్లర్లు.. అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ భారతీయ పౌరులకు అలర్ట్
- ●Bhavani Devotees | దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
- ●Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కారణం ఏంటంటే?
- ●Liquor Sales | సర్కారుకు కాసుల వర్షం.. దుమ్మురేపిన దసరా లిక్కర్ సేల్స్
- ●RRB Station Master | 1250 పోస్టులతో ఆర్ఆర్బీ రైల్వే స్టేషన్ మాస్టర్ నోఫికేషన్.. మారిన పరీక్ష విధానం..
- ●Horoscope | అక్టోబర్ 22 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని సమస్యలు రావచ్చు!

Safety Advisory | ఫ్రాన్స్‌లో అల్లర్లు.. అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ భారతీయ పౌరులకు అలర్ట్

Bhavani Devotees | దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కారణం ఏంటంటే?

Liquor Sales | సర్కారుకు కాసుల వర్షం.. దుమ్మురేపిన దసరా లిక్కర్ సేల్స్






