K-Harmony Festa | హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 25న ‘కె-హార్మనీ ఫెస్టా’
K-Harmony Festa | భారత్ - దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతోపాటు, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహభావం, పరస్పర అవగాహన పెంపొందించేందుకు అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు దోహదపడతాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) అన్నారు.
సాంస్కృతిక మార్పిడితో పర్యాటక రంగానికి ప్రోత్సాహం
భారత్ - దక్షిణ కొరియా మధ్య స్నేహభావం పెంపొందించాలి
రాష్ట్ర కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
K-Harmony Festa | త్రినేత్ర న్యూస్ : భారత్ - దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతోపాటు, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహభావం, పరస్పర అవగాహన పెంపొందించేందుకు అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు దోహదపడతాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) అన్నారు. తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వం, విభిన్న కళారూపాలు, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు మంచి అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.
కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అక్టోబర్ 25న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘కె-హార్మనీ ఫెస్టా–2026’ ( K-Harmony Festa ) నిర్వహించనున్నారు. భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం, ఇరు దేశాల కళలు, సంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది.
భారతదేశం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని, తెలంగాణ సంస్కృతి తనదైన కళారూపాలు, జానపద సంప్రదాయాలు, పండుగలతో ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన పేరిణి నృత్యం, డప్పుల దరువుతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఉత్సవంలో ప్రదర్శించనుండటం రాష్ట్ర కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దోహదపడుతుందని తెలిపారు.
హైదరాబాద్ చారిత్రక వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యంతో వివిధ దేశాల ప్రజలను ఆకర్షిస్తున్న నగరమని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటువంటి అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహణతో హైదరాబాద్ సాంస్కృతిక కేంద్రంగా మరింత గుర్తింపు పొందడంతోపాటు, తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, జానపద కళలు, సంప్రదాయ ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు కళాకారులకు కొత్త అవకాశాలను కల్పించడంతోపాటు, పర్యాటక రంగ అభివృద్ధికి, ప్రజల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి దోహదపడతాయని అన్నారు.
ఈ ఉత్సవంలో కొరియా సంప్రదాయ కళలు, సంగీతం, తైక్వాండో ప్రదర్శనలతోపాటు ఆధునిక సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ కె-పాప్ బృందం ఎన్‌టీఎక్స్ (NTX) ప్రత్యేక ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొరియా సంప్రదాయ, సమకాలీన సంస్కృతిని పరిచయం చేసే కార్యక్రమాలతోపాటు తెలంగాణ కళారూపాల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
సంబంధిత వార్తలు

Suicide | కుషాయిగూడలో విషాదం.. హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య
అక్టోబర్ 21, 2026

Hyderabad Metro New Coaches | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రూ.923 కోట్లతో 60 కొత్త కోచ్‌లు.. ఇక పీక్ అవర్స్ రద్దీకి చెక్
అక్టోబర్ 21, 2026

Traffic Restrictions | హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..
అక్టోబర్ 21, 2026
తాజావార్తలు
- ●Suicide | కుషాయిగూడలో విషాదం.. హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య
- ●Hyderabad Metro New Coaches | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రూ.923 కోట్లతో 60 కొత్త కోచ్‌లు.. ఇక పీక్ అవర్స్ రద్దీకి చెక్
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Amit Shah | 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా
- ●SBI | ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. డార్క్ వెబ్‌లో డేటా.. స్పందించిన బ్యాంక్..
- ●Naga Chaitanya | రిలీజ్ డేట్ చెప్పేశారు - షూటింగ్ మాత్రం పెండింగ్ - నాగచైతన్య వృషకర్మపై అప్డేట్

Suicide | కుషాయిగూడలో విషాదం.. హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య

Hyderabad Metro New Coaches | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రూ.923 కోట్లతో 60 కొత్త కోచ్‌లు.. ఇక పీక్ అవర్స్ రద్దీకి చెక్

Traffic Restrictions | హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..

Amit Shah | 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా



