Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కారణం ఏంటంటే?
Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) బ్రేక్ పడింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల (Urban Local Body Elections) ప్రక్రియను తాత్కాలికంగా నిలివేస్తున్నట్లు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ (SEC) ప్రకటించింది.
Andhra pradesh | Published On Oct 22, 2026, 7.41 am IST
Municipal Elections | త్రినేత్ర న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) బ్రేక్ పడింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల (Urban Local Body Elections) ప్రక్రియను తాత్కాలికంగా నిలివేస్తున్నట్లు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ (SEC) ప్రకటించింది. నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, నామినేషన్లు వేకుండా అభ్యర్థులను అడ్డుకున్నారన్న ఫిర్యాదులపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించవద్దని ఆదేశించింది. దీంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణ పక్రియ పూర్తయినప్పటికీ తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా నిలిపివేసింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు ఇచ్చే నివేదికలను పరిశీలించి గురువారం తుది నిర్ణయం వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయొద్దని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినా.. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల నిలిపేశారు.
పిడుగురాళ్ల, గురజాల, దర్శి, పుంగనూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, దాచేపల్లి, గుత్తి, రాజంపేట, పులివెందుల, బద్వేలు, ప్రొద్దుటూరు, కనిగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతో పాటు కడప, తిరుపతి నగరపాలక సంస్థల్లో నామినేషన్లు వేయకుండా తమను అడ్డుకున్నారని సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటన నిలిపివేసి.. ఫిర్యాదులపై గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. నామినేషన్ దాఖలుకు ఎక్కడైనా గడువు పొడిగించాల్సి వస్తే.. నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి గరిష్ఠంగా 48 గంటల సమయం ఇవ్వాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
ఎన్నికల సంఘం ఇటీవల జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అక్టోబర్ 28న ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లను స్వీకరించగా.. అక్టోబర్ 19న స్క్రూటినీ నిర్వహించారు. భద్రత, క్షేత్రస్థాయి పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు సమర్పించిన రిపోర్టులు పరిశీలించాక నామినేషన్ల తుది గడువు పొడిగింపుపై గురువారం నిర్ణయాన్ని ప్రకటిస్తామని పునేఠా (Anil Chandra Punetha) తెలిపారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న 19 మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నామినేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉన్న అర్బన్ లోకల్ బాడీలను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Supreme Court | ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
అక్టోబర్ 21, 2026

Kiren Rijiju Mallikarjun Kharge Letter | డీఎంకే, వైఎస్సార్సీపీలతో చర్చించాం.. కాంగ్రెస్ స్పందించలేదు
అక్టోబర్ 19, 2026

Navaratri Brahmotsavam | సూర్యప్రభ వాహనం విహరించిన మలయప్పస్వామి.. పరవశించిన భక్తజనం
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Liquor Sales | సర్కారుకు కాసుల వర్షం.. దుమ్మురేపిన దసరా లిక్కర్ సేల్స్
- ●RRB Station Master | 1250 పోస్టులతో ఆర్ఆర్బీ రైల్వే స్టేషన్ మాస్టర్ నోఫికేషన్.. మారిన పరీక్ష విధానం..
- ●Horoscope | అక్టోబర్ 22 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని సమస్యలు రావచ్చు!
- ●TV Channels | టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!
- ●CM Revanth Reddy | మైసూరు దసరా ఉత్సవాలు.. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- ●Akhilesh Yadav Slams BJP | అక్రమాలకు పాల్పడితే జైలుకే: విద్యాశాఖ అధికారులకు అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్

Liquor Sales | సర్కారుకు కాసుల వర్షం.. దుమ్మురేపిన దసరా లిక్కర్ సేల్స్

RRB Station Master | 1250 పోస్టులతో ఆర్ఆర్బీ రైల్వే స్టేషన్ మాస్టర్ నోఫికేషన్.. మారిన పరీక్ష విధానం..

Horoscope | అక్టోబర్ 22 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని సమస్యలు రావచ్చు!

TV Channels | టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!



