Fire accident | మైత్రివనంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
Fire accident | హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రివనంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని బొమ్మల దుకాణంలో మంటలు అంటుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Fire accident | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రివనంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో పిల్లర్ నెంబర్ 1043 వద్ద కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని బొమ్మల దుకాణంలో మంటలు అంటుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. షాపింగ్ కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పక్కన ఉన్న దుకాణాలకు సైతం మంటలు వ్యాపిస్తున్నాయి. ఘటనా స్థలంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు పొగ దట్టంగా వ్యాపించడంతో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రమాద స్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు మరికొన్ని వాటర్ ట్యాంకర్లను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దట్టమైన పొగతో స్థానిక ప్రజలు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అమీర్‌పేటలోని ప్రధాన రహదారికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలతోపాటు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | పెద్ది రిలీజ్ వేళ - తిరుమలలో జాన్వీ కపూర్ సందడి - కాలినడకన శ్రీవారి దర్శనం
- ●Chirumarthi Lingaiah | కేసీఆర్‌ను అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- ●Rains | రాబోయే 2 గంటల్లో.. తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు
- ●Passport | పాస్‌పోర్ట్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా ఫోన్లో అప్లై చేయవచ్చు..
- ●Srinivas Goud | సీఎం రేవంత్ ఎండిపోయిన ప్రాజెక్టులు చూడ్డానికి వస్తున్నడు: శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా
- ●Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణం..!

Janhvi Kapoor | పెద్ది రిలీజ్ వేళ - తిరుమలలో జాన్వీ కపూర్ సందడి - కాలినడకన శ్రీవారి దర్శనం

Chirumarthi Lingaiah | కేసీఆర్‌ను అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Rains | రాబోయే 2 గంటల్లో.. తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Passport | పాస్‌పోర్ట్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా ఫోన్లో అప్లై చేయవచ్చు..






