HMWSSB | త్వరలోనే పెరగనున్న నీటి బిల్లులు..! ప్రజలపై అదనంగా రూ. 60 కోట్ల భారం..!!
HMWSSB | ఇప్పటికే ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలతో హైదరాబాద్( Hyderabad ) వాసులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో మరో పిడుగు లాంటి వార్త వినిపించింది. త్వరలోనే నీటి బిల్లులు( Water Bill ) పెంచేందుకు జలమండలి( HMWSSb ) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
HMWSSB | త్రినేత్ర.న్యూస్ : ఇప్పటికే ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలతో హైదరాబాద్( Hyderabad ) వాసులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో మరో పిడుగు లాంటి వార్త వినిపించింది. త్వరలోనే నీటి బిల్లులు( Water Bill ) పెంచేందుకు జలమండలి( HMWSSb ) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యూర్ బిల్లు 2026( CURE Bill 2026 ) ప్రకారం.. ప్రతి ఏడాది నీటి బిల్లులు 5 శాతం మేర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకే జలమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 15 ఏండ్ల తర్వాత నీటి బిల్లుల టారిఫ్‌ను పెంచుతున్నారు.
ఇప్పటి వరకు కిలో లీటర్‌కు రూ. 10 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో నెలకు జలమండలికి నీటి బిల్లుల ఆదాయం రూ. 110 కోట్ల వరకు వస్తుంది. ఇప్పుడు క్యూర్ బిల్లు ప్రకారం నీటి బిల్లుల టారిఫ్ 5 శాతం పెంచితే.. ప్రజలపై ఏడాదికి రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఐదేండ్లలో ఈ పెంపు మొత్తం 25 శాతానికి చేరుకోవచ్చు.
నీటి బిల్లుల టారిఫ్ పెంపు అనేది దాదాపు 10 లక్షల మంది వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత నీరు పొందుతున్న 5 లక్షల మంది వినియోగదారులకు 5 శాతం టారిఫ్ నుంచి మినహాయింపు ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 750 మిలియన్ గ్యాలన్ల నీటి అవసరం ఉండగా, సరాఫరా మాత్రం 600 మిలియన్ గ్యాలన్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం 150 మిలియన్ గ్యాలన్ల కొరత ఉండగా, భవిష్యత్‌లో ఇది 230కి చేరుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Dasara Holidays | అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు.. ముఖ్యమైన తేదీలివే..!
- ●బీఆర్ఎస్కు కౌంటర్ సరే సీఎం సాబ్… 22ఏ బాధితుల ప్రశ్నలకు జవాబేది?
- ●Heat Wave | హైదరాబాద్‌లో మండుటెండలు.. 40 డిగ్రీలకు చేరువలో పగటి ఉష్ణోగ్రతలు
- ●Navpancham Rajyogam | నేడు నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు, పెండింగ్ పనులకు మోక్షం..!
- ●Vastu Tips | ఈ నాలుగు మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక నష్టాలు..!

Dasara Holidays | అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు.. ముఖ్యమైన తేదీలివే..!

బీఆర్ఎస్కు కౌంటర్ సరే సీఎం సాబ్… 22ఏ బాధితుల ప్రశ్నలకు జవాబేది?

Heat Wave | హైదరాబాద్‌లో మండుటెండలు.. 40 డిగ్రీలకు చేరువలో పగటి ఉష్ణోగ్రతలు

Navpancham Rajyogam | నేడు నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు, పెండింగ్ పనులకు మోక్షం..!





