లోడ్ అవుతోంది...


Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల విభజనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే అని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమై.. 17న చేపట్టే శాంతి ర్యాలీపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మల్కాజ్గిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా? సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లో చేర్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటన చేయడం ప్రజలను మభ్య పెట్టడమే అని తలసాని మండిపడ్డారు.
భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిది. మన అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి. 17వ తేదీన నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల 5న హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం ఇచ్చారు. 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో అన్ని సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.

జనవరి 13, 2026

జనవరి 13, 2026

జనవరి 13, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam