త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold-Silver Price | స‌రికొత్త గ‌రిష్టాల‌కు బంగారం, వెండి..! ఒకే రోజు ధ‌ర ఎంత పెరిగిందో తెలుసా..?

Gold-Silver Price | బంగారం ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొన్న అనిశ్చితి, భౌగోళిక రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య బంగారం ధ‌ర‌లు గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా పెరుగుతున్నాయి.

P

Business | Published On Jan 13, 2026, 7.28 pm IST

Gold-Silver Price | స‌రికొత్త గ‌రిష్టాల‌కు బంగారం, వెండి..! ఒకే రోజు ధ‌ర ఎంత పెరిగిందో తెలుసా..?
Advertisement

Gold-Silver Price | బంగారం ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొన్న అనిశ్చితి, భౌగోళిక రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య బంగారం ధ‌ర‌లు గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా పెరుగుతున్నాయి. వ‌రుస‌గా పెరుగుతున్న ధ‌ర‌ల‌తో సామాన్యులు షాక్‌కు గుర‌వుతున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ బులియ‌న్ మార్కెట్‌లో మంగ‌ళ‌వారం ధ‌ర‌లు స‌రికొత్త రికార్డుల‌ను తాకాయి. వెండి ఒకే రోజు రూ.6వేలు పెరిగి కిలో ధ‌ర రూ.2.71ల‌క్ష‌లు చేరిన జీవిత‌కాల గ‌రిష్టానికి చేరింది. అదే స‌మ‌యంలో బంగారం ధ‌ర సైతం పెరిగింది. తులానికి రూ.1.45ల‌క్ష‌ల‌కు చేరి గ‌రిష్టాన్ని తాకింది.

మార్కెట్‌లో పెట్టుబ‌డిదారులు వెండిని కొనుగోలు చేస్తుండ‌డంతో ధ‌ర పెరుగుతుంద‌ని ఆల్ ఇండియా స‌రాఫా అసోసియేష‌న్ తెలిపింది. అంత‌కు ముందు సోమ‌వారం వెండి ధ‌ర రూ.15వేలు పెరిగి కిలోకు రూ.2.65ల‌క్ష‌ల‌కు చేరుకుంది. గ‌త మూడురోజుల్లో సిల్వ‌ర్ రూ.21వేలు పెరిగి 8.4శాతం న‌మోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభం (డిసెంబ‌ర్ 31)తో పోలిస్తే వెండి ధ‌ర‌లు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.32వేలు పెరిగాయి.

అదే స‌మ‌యంలో బంగారం సైతం స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పుతున్న‌ది. 24 క్యారెట్ల ప‌సిడి మంగ‌ళ‌వారం రూ.400 పెరిగి తులానికి రూ.1.45ల‌క్ష‌ల వ‌ద్ద జీవ‌న‌కాల గ‌రిష్టానికి చేరుకుంది. గ‌త సెష‌న్‌లో రూ.2900 పెరిగిన విష‌యం తెలిసిందే. ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణంగా సుర‌క్షిత పెట్టుబ‌డులుకు పెరుగుతున్న డిమాండ్ కార‌ణ‌మ‌ని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. బులియన్ మార్కెట్‌లో ధ‌ర‌ల పెర‌గ‌డానికి ఇరాన్‌లో కొన‌సాగుతున్న దీర్ఘ‌కాలిక భౌగోళిక రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లే కార‌ణ‌మ‌న్నారు.

అదే స‌మ‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిమాండ్ ఉంద‌న్నారు. సోమ‌వారం బంగారం ఔన్సుకు 4,630.47 వద్ద రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. మంగ‌ళ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్పాట్ గోల్డ్ 0.24శాతం త‌గ్గి ఔన్స్‌కు 4,586.49 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ్ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ సిల్వ్ ఔన్సుకు 85.64 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు బెదిరింపులు సైతం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం క‌నిపిస్తున్న‌ది. ఫెడ్ చైర్మ‌న్ జెరోమ్ పాలెల్‌పై న్యాయ‌శాఖ ద‌ర్యాప్తును మాజీ ఫెడ్ చైర్మ‌న్‌లు, ఆర్థిక‌వేత్త‌లు సంయుక్తంగా చేసిన ప్ర‌క‌ట‌న కొంత వ‌ర‌కు ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది. దాంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా బంగారంలో లాభాల స్వీక‌ర‌ణ‌కు దారి తీసింద‌ని మిరే అసెట్ షేర్ ఖాన్ క‌మోడిటీ హెడ్ ప్ర‌వీణ్ సింగ్ తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement