త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eggs Prices | హైద‌రాబాద్‌లో కొండెక్కిన కోడిగుడ్ల ధ‌ర‌లు.. డ‌జ‌న్ రూ. 100 పైనే..!

Eggs Prices | హైద‌రాబాద్ న‌గ‌రంలో కోడిగుడ్ల ధ‌ర‌లు( Eggs Prices ) కొండెక్కాయి. ఊహించ‌ని విధంగా ధ‌ర‌లు పెరిగాయి. ఒక్కో కోడిగుడ్డు ధ‌ర రూ. 8 నుంచి రూ. 9 వ‌ర‌కు ప‌లుకుతోంది. దీంతో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు కోడిగుడ్ల‌ను కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

S

Hyderabad | Published On Jul 14, 2026, 4.55 pm IST

Eggs Prices | హైద‌రాబాద్‌లో కొండెక్కిన కోడిగుడ్ల ధ‌ర‌లు.. డ‌జ‌న్ రూ. 100 పైనే..!
Advertisement

Eggs Prices | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో కోడిగుడ్ల ధ‌ర‌లు( Eggs Prices ) కొండెక్కాయి. ఊహించ‌ని విధంగా ధ‌ర‌లు పెరిగాయి. ఒక్కో కోడిగుడ్డు ధ‌ర రూ. 8 నుంచి రూ. 9 వ‌ర‌కు ప‌లుకుతోంది. దీంతో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు కోడిగుడ్ల‌ను కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కార‌ణం.. దాణా ఖ‌ర్చులు పెర‌గ‌డం, అధిక ర‌వాణా ఖ‌ర్చుల‌తో పాటు కోళ్ల‌కు వ్యాధులు సంభ‌వించ‌డ‌మే అని పౌల్ట్రీ య‌జ‌మానులు పేర్కొంటున్నారు.

సాధార‌ణంగా కోడిగుడ్ల ధ‌ర‌లు శీతాకాలంలో పెరుగుతాయి. ఎందుకంటే ఆ సీజ‌న్‌లో కోడిగుడ్ల‌కు డిమాండ్ భారీగా ఉంటుంది. కానీ ఎలాంటి డిమాండ్ లేని వ‌ర్షాకాలంలో కోడిగుడ్ల ధ‌ర‌లు పెర‌గ‌డం ఒకింత ఆందోళ‌న‌కు గురి చేస్తుంది.

భారీగా పెరిగిన దాణా ధ‌ర‌లు

హైద‌రాబాద్‌కు చెందిన ఓ పౌల్ట్రీ య‌జ‌మాని మాట్లాడుతూ.. ఉన్న‌ట్టుండి దాణా ఖ‌ర్చులు అమాంతం పెరిగిపోయాయి. కిలో సోయాబీన్ ధ‌ర రూ. 35 నుంచి రూ. 68కి పెరిగింది. మొక్కజొన్న ధ‌ర‌లు కూడా రూ. 20 నుంచి రూ. 28 వ‌ర‌కు పెరిగాయి. గ‌త కొన్ని నెల‌ల నుంచి ఈ ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

దాదాపు రూ. 1 ల‌క్ష అద‌నంగా ఖ‌ర్చు

అయితే గుడ్లు పెట్టే కోడి రోజుకు సుమారు 100 నుంచి 115 గ్రాముల వ‌ర‌కు దాణా తింటుంద‌ని పేర్కొన్నారు. ఈ లెక్క‌న చూస్తే ల‌క్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 10 ట‌న్నుల‌కు పైగా దాణా అవ‌స‌రమ‌వుతుంది. ఈ క్ర‌మంలో రోజువారీ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌కు దాదాపు రూ. 1 ల‌క్ష అద‌నంగా ఖ‌ర్చు అవుతుంద‌ని తెలిపారు. అయితే ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం కార‌ణం. ఎందుకంటే దాణాతో పాటు గుడ్ల‌ను కూడా ర‌వాణా చేయాల్సి ఉంటుంది. దాంతో ఆ భారాన్ని అధిగ‌మించేందుకు చివ‌ర‌కు కోడిగుడ్ల ధ‌ర పెంచాల్సి వ‌స్తుంద‌ని స‌ద‌రు య‌జ‌మాని తెలిపారు.

వైర‌ల్ ఇన్‌స్పెక్ష‌న్ల వ‌ల్ల‌

వైర‌ల్ ఇన్‌స్పెక్ష‌న్ల కార‌ణంగా కూడా కోళ్లు చ‌నిపోతున్నాయ‌ని మ‌రో పౌల్ట్రీ య‌జ‌మాని పేర్కొన్నారు. ఒక కోడి చ‌నిపోయిన త‌ర్వాత దాని స్థానంలో మ‌రో కోడి గుడ్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి క‌నీసం రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ఈ గ్యాప్ కార‌ణంగా కూడా కోడిగుడ్ల ధ‌ర‌లు పెరుగుతున్నాయి.

Advertisement
Advertisement