త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Varanasi Story | రాజ‌మౌళి వార‌ణాసి క‌థ లీక్ – రుద్ర, మందాకిని సీక్రెట్ మిష‌న్ – రామాయ‌ణంతో లింక్‌

మ‌హేష్‌బాబు వార‌ణాసి మూవీ క‌థ లీకైందంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వార‌ణాసిలోనే ఈ సినిమా మొద‌లై రామాయ‌ణ కాలానికి వెళుతుంద‌ని అంటున్నారు. ఇందులో అగ్ర శ‌క‌లం బారి నుంచి ప్ర‌పంచాన్ని కాపాడే ఆర్కియాల‌జిస్ట్ పాత్ర‌లో మ‌హేష్‌బాబు క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Movies | Published On Aug 8, 2026, 4.39 pm IST

Varanasi Story | రాజ‌మౌళి వార‌ణాసి క‌థ లీక్ –  రుద్ర, మందాకిని  సీక్రెట్ మిష‌న్  – రామాయ‌ణంతో లింక్‌
Advertisement

Varanasi Story |  మ‌హేష్‌బాబు హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూవీ వార‌ణాసి. అడ్వెంచ‌ర్ టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతోనే గ్లోబ‌ల్ స్టార్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. దాదాపు 1500 కోట్లతో మ‌హేష్‌బాబుతో పాటు రాజ‌మౌళి కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీగా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న వార‌ణాసి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

అంటార్కిటికా...ఆఫ్రికా...

వార‌ణాసి స్టోరీ ఏంటి? మ‌హేష్‌బాబు, ప్రియాంక చోప్రా పాత్ర‌లు ఎలా ఉంటాయి? ఇందులో న‌టిస్తున్న మిగిలిన యాక్ట‌ర్లు ఎవ‌ర‌న్న‌ది ఒక్కొక్క‌టిగా రివీల్ చేస్తూ సినిమాపై ఉన్న హైప్‌ను రెట్టింపు చేస్తున్నారు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. ఇటీవ‌ల ఓ హాలీవుడ్ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వార‌ణాసి స్టోరీపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. వార‌ణాసి న‌గ‌రంలో ఈ సినిమా క‌థ మొద‌లై అంటార్కిటికా మంచు ఖండాల‌ను దాటి ఆఫ్రికా అడ‌వుల్లోకి అడుగుపెట్టి...అక్క‌డి నుంచి రామాయ‌ణ కాలానికి టైమ్ ట్రావెల్ ద్వారా ప్ర‌యాణిస్తుంద‌ని అన్నారు. చివ‌ర‌కు వార‌ణాసిలోనే క‌థ ముగుస్తుంద‌ని హింట్ ఇచ్చారు. వార‌ణాసి షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అయిన‌ట్లు వెల్ల‌డించారు. రాజ‌మౌళి వ్యాఖ్య‌ల‌తో వార‌ణాసి సినిమా అంచ‌నాల‌కు మించి ఉండ‌బోతున్న‌ట్లు అభిమానులు ఫిక్సైపోయారు.

క‌థ లీక్‌...

కాగా వార‌ణాసి మూవీ క‌థ లీకైందంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. 2027లో వార‌ణాసి క‌థ మొద‌లై రామాయ‌ణ కాలానికి వెళుతుందంటూ చెబుతోన్న ఓ స్టోరీని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. 2027లో శాంభ‌వి అనే గ్ర‌హ‌శ‌క‌లం వార‌ణాసిని ఢీకొట్టేందుకు వ‌స్తుంటుంది. ఈ గ్ర‌హ‌శ‌క‌లం భూమిపై ప‌డితే ప్ర‌పంచ వినాశ‌నం త‌ప్ప‌ద‌ని అంద‌రూ భ‌య‌ప‌డుతుంటారు. ఈ విప‌త్తును ఎదుర్కొనేందుకు ఆర్కియాల‌జిస్ట్ రుద్ర రంగంలోకి దిగుతాడు. అత‌డికి చ‌రిత్ర‌కారిణి అయినా మందాకిని సాయంగా నిల‌బ‌డుతుంది. ఓ పురాత‌న‌మైన ఖ‌గోళ వ‌స్తువు వారికి అవ‌స‌ర‌మ‌వుతుంది. దాని కోసం  అంటార్కిటికా, ఆఫ్రికా అడ‌వుల‌తో పాటు ఎన్నో మిస్ట‌రీయిస్ ప్లేస్‌ల‌లో వారి అన్వేష‌ణ సాగుతుంది. చివ‌ర‌కు ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం రామాయ‌ణంలో ఉంద‌ని క‌నిపెడ‌తారు. టైమ్ మిష‌న్ ద్వారా రుద్ర‌, మందానికి రామాయ‌ణ కాలానికి వెళ్లారా? వారిని ర‌హ‌స్యంగా అనుస‌రించిన కుంభా ఎవ‌రు? వార‌ణాసిలోనే మొద‌లైన ప్ర‌యాణం చివ‌ర‌కు వార‌ణాసికి ఎలా చేరింది? శాంభ‌వి బారి నుంచి భూమిని ఎలా కాపాడార‌నే అంశాల‌తో వార‌ణాసి క‌థ సాగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌ల‌యాళ హీరో...

టైమ్ ట్రావెల్‌, సైన్స్ ఫిక్ష‌న్‌, యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ అంశాల‌తో మ‌ల్టీ జాన‌ర్ మూవీగా రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. వార‌ణాసిలో మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. 80 శాతానికిపైగా వార‌ణాసి షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రాపై ఓ పాట‌ను షూట్ చేస్తున్నారు రాజ‌మౌళి. ఈ సాంగ్ తో గ్లోబ‌ల్ స్టార్ పాత్ర‌కు సంబంధించిన మొత్తం షూటింగ్‌ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. వార‌ణాసికి ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి సంగ‌తం అందిస్తున్నారు.

 

Advertisement
Advertisement