త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్‌’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో త‌ళుక్కుమ‌న్న తార‌లు..!

Toxic Trailer Launch | రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌కు బెంగళూరు వేదిక కానుంది. శనివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

P

Entertainment | Published On Aug 8, 2026, 4.57 pm IST

Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్‌’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో త‌ళుక్కుమ‌న్న తార‌లు..!
Advertisement

Toxic Trailer Launch | రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌కు బెంగళూరు వేదిక కానుంది. శనివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా బెంగళూరు చేరుకున్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కియారా నీలి రంగు దుస్తుల్లో, ఓపెన్‌ హెయిర్‌, సన్‌గ్లాసెస్‌తో విమానాశ్రయంలో తళుక్కుమన్నది. క్రీమ్‌ రంగు బ్యాగ్‌తో కనిపించారు. హుమా ఖురేషి క్రీమ్‌ రంగు సూట్‌, సన్‌గ్లాసెస్‌తో మెరిసింది. తారా సుతారియా బ్లేజర్‌, షార్ట్స్‌తో పాటు సన్‌గ్లాసెస్‌ ధరించి క‌నిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

టాక్సిక్‌పై భారీ అంచనాలు..

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌, వెంకట్‌ కే. నారాయణ నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ ప్రపంచం, భారీ యాక్షన్‌ నేపథ్యంలో కథ సాగనున్నట్లు ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో యశ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ జేజే పెర్రీతో పాటు అన్బరివ్‌ వంటి యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు ఈ చిత్రానికి పనిచేశారు. దీంతో సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

పాటలకు మంచి స్పందన..

చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘తాబాహీ’ పాటలో యశ్‌, కియారా జోడీ ఆకట్టుకుంది. తాజాగా తారా సుతారియాతో యశ్‌పై తెరకెక్కించిన ‘మధోష్‌’ పాట కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ‘టాక్సిక్‌’ను కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో తెరకెక్కించారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్‌ డ్రామా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే టీజర్‌, పాటలతో ఆసక్తి పెంచిన ‘టాక్సిక్‌’ ట్రైలర్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ట్రైలర్‌లో యశ్‌ పాత్ర, కథ నేపథ్యంతో పాటు యాక్షన్‌ సన్నివేశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by BollywoodLife (@ibollywoodlife)

Advertisement
Advertisement