త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Online Gaming Scam | హైద‌రాబాద్‌లో రూ.5 వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ స్కాం..

Online Gaming Scam | హైద‌రాబాద్‌లో (Hyderabad) మ‌రో భారీ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. ఫిన్‌టెక్ పేరుతో గుట్టుగా సాగుతున్న‌ రూ.5 వేల కోట్ల‌ ఆన్‌లైన్ గేమింగ్ స్కాంను (Online Gaming Scam) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) ర‌ట్టుచేసింది.

G

Hyderabad | Published On Feb 9, 2026, 12.07 pm IST

Online Gaming Scam | హైద‌రాబాద్‌లో రూ.5 వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ స్కాం..
Advertisement

Online Gaming Scam | త్రినేత్ర‌.న్యూస్: హైద‌రాబాద్‌లో (Hyderabad) మ‌రో భారీ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. ఫిన్‌టెక్ పేరుతో గుట్టుగా సాగుతున్న‌ రూ.5 వేల కోట్ల‌ ఆన్‌లైన్ గేమింగ్ స్కాంను (Online Gaming Scam) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) ర‌ట్టుచేసింది. ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming) పేరుతో ఒపీనియ‌న్ వెబ్ సొల్యూష‌న్స్‌, వెబ్ విన్ సొల్యూష‌న్స్ అనే డొల్ల కంపెనీలకు కోట్లాది రూపాయలు మళ్లించిన‌ట్లు డీజీజీఐ గుర్తించింది. దుబాయ్ కేంద్రంగా ఆన్‌లైన్ గేమ్ దందా జ‌రిగిన‌ట్లు తేలింది.

అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగించి బ్యాంకులకే టోకరా వేసిన‌ట్లు గుర్తించారు. నిందితులు ఓటీపీ (OTP) లేకుండానే రూ.5 వేల కోట్లు దారి మ‌ళ్లించారని తెలుస్తున్న‌ది. అదేవిధంగా జీఎస్టీని (GST) ఎగ్గొట్టేందుకు ఎస్క్రో (Escrow) ఖాతాల వినియోగించినట్లు అధికారులు వెల్ల‌డించారు. funinmatch360, raceje-et247 వెబ్‌సైట్ల ద్వారా అక్ర‌మంగా దంగా సాగిన‌ట్లు పేర్కొన్నారు. బ్యాంకింగ్ ఏపీఐల‌ను దుర్వినియోగం చేసి, ఆడిట్‌కు దొరక్కుండా జాగ్రత్తపడ్డార‌ని తెలిపారు. ఈ వ్య‌వ‌హారంలో విగోఫిన్ (Wegofin) డైరెక్టర్లు ప్రభుకుమార్, రాజశేఖర్ రెడ్డి పాత్ర‌పై అధికారులు ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం.

యాప్ ఆధారిత డిజిట్ డిపాజిట్ల పేరుతో ఫాల్క‌న్ కంపెనీ (Falcon Company) రూ.850 కోట్లు కొట్టేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఆ కంపెనీ ఎండీ అమ‌ర్ దీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాప్ ద్వారా డ‌బ్బులు పెట్టుబ‌డులుగా తీసుకోవ‌డం, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వ‌స్తాయంటూ న‌మ్మ‌బ‌ల‌క‌డం, పెద్ద కంపెనీల్లో పెట్టుబ‌డులు పెడ‌తామని చెప్పి పెద్ద మొత్తంలో డ‌బ్బులు వ‌సూలుచేసి ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టించారు. ఫాల్క‌న్ స్కాం వెలుగులోకి రాగానే అమ‌ర్ దీప్ త‌న భార్య‌తో క‌లిసి దుబాయ్ పారిపోయిన విష‌యం విదిత‌మే.

Advertisement
Advertisement