Devnar Foundation | వరల్డ్ రికార్డు.. ఇంటర్ పరీక్షలకు 132 అంధ విద్యార్థులు హాజరు..!
Devnar Foundation | హైదరాబాద్ నగరంలోని దేవనార్ ఫౌండేషన్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. రికార్డు స్థాయిలో ఈ సంస్థ నుంచి 132 అంధ విద్యార్థులు త్వరలో జరగబోయే ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఒకే సంస్థ నుంచి ఈ స్థాయిలో అంధ విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవ్వడం ఇదే తొలిసారి అని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.
Devnar Foundation | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని దేవనార్ ఫౌండేషన్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. రికార్డు స్థాయిలో ఈ సంస్థ నుంచి 132 అంధ విద్యార్థులు త్వరలో జరగబోయే ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఒకే సంస్థ నుంచి ఈ స్థాయిలో అంధ విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవ్వడం ఇదే తొలిసారి అని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 76 మంది, ప్రథమ సంవత్సరం పరీక్షలకు 56 మంది హాజరు కానున్నారు.
దేవనార్ ఫౌండేషన్ నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థి గణపతి సౌత్ ఈస్ట్ ఏషియన్ రన్నింగ్ కాంపిటీషన్స్‌కు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. గణపతి స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా అని తెలిపారు. ఇక ఈ సంస్థలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు బ్యాంకులు, మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. స్వతంత్రంగా బతుకుతూ కుటుంబాలను పోషిస్తున్నారని తెలిపారు.
దేవనార్ ఫౌండేషన్‌లో ఆరో తరగతి నుంచి విద్యార్థులకు ప్రత్యేక కంప్యూటర్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంటర్ విద్య అనంతరం ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు, నేషనల్ లా స్కూల్స్‌లో ప్రవేశాలు పొందేందుకు కంప్యూటర్ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. తమ స్కూల్‌లో చదువుకున్న ఓ విద్యార్థి అమెరికాలోని మాశచుట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యను అభ్యసించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.
దేవనార్ ఫౌండేషన్‌ను 1992లో ఇంగ్లీష్ మీడియంలో స్థాపించారు. అంధుల కోసమే ప్రత్యేకంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గత మూడు దశాబ్దాలుగా 600 మందికి పైగా అంధ విద్యార్థులకు విద్యా, వసతి సౌకర్యాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ ఫౌండేషన్‌లో స్కూల్ విద్యతో పాటు ఇంటర్, డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




