Drunk and Drive Cases | కేసులవుతున్నా మారరేం.. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 320 మందిపై కేసులు
Drunk and Drive Cases | సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 320 మందిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ జి.నరేెందర్ తెలిపారు.
Drunk and Drive Cases | త్రినేత్ర న్యూస్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 320 మందిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ జి.నరేెందర్ తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారన్నారు. 265 ద్విచక్ర వాహనదారులు, 16 ఆటోలు, 38 కార్లు, 1 హెవీ వాహనదారులపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా 266 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 38 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 16 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారన్నారు. వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని ఆయన పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామన్నారు. ఈ నేరానికి 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.
గత వారం (12-10-2026 to 17-10-2026)లో 196 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించినట్లు వెల్లడించారు. 5 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 191 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ●Prabhas Spirit | అఫీషియల్ : ప్రభాస్ స్పిరిట్ వాయిదా - ఫౌజీ కోసమేనా?
- ●Suicide | తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య
- ●Shami Tree | శమీ వృక్షాలు నాటి పెంచుతాం.. పర్యావరణహితానికి ప్రతిన తీసుకుంటాం
- ●Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? - ధర్మన్లో సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్స్టార్
- ●Moon shrinking | కుచించుకుపోతున్న చంద్రుడు..
- ●Tollywood | వాట్ నెక్స్ట్ - స్టార్ హీరోయిన్ల కొత్త సినిమా కబురు ఎప్పుడు?

Prabhas Spirit | అఫీషియల్ : ప్రభాస్ స్పిరిట్ వాయిదా - ఫౌజీ కోసమేనా?

Suicide | తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య

Shami Tree | శమీ వృక్షాలు నాటి పెంచుతాం.. పర్యావరణహితానికి ప్రతిన తీసుకుంటాం

Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? - ధర్మన్లో సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్స్టార్





