త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Protest at DGP Office | డీజీపీ ఆఫీసు వద్ద రణరంగం.. బీజేపీ ముట్టడి.. కిందపడ్డ డీసీపీ

హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై ఆందోళన చేపట్టిన బీజేపీ శ్రేణులకి, పోలీసులకి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు.

J

Hyderabad | Published On Feb 10, 2026, 5.01 pm IST

BJP Protest at DGP Office | డీజీపీ ఆఫీసు వద్ద రణరంగం.. బీజేపీ ముట్టడి.. కిందపడ్డ డీసీపీ
Advertisement
  • బీజేపీ ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత

BJP Protest at DGP Office | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద మంగళవారం హైడ్రామా నెలకొంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ ఆఫీసు ముట్టడికి యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అసలేం జరిగింది?

మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ నేతల వేధింపులు, ఒత్తిడి తట్టుకోలేకే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలివచ్చారు.

తోపులాటలో కిందపడ్డ డీసీపీ

ఆందోళనకారులు డీజీపీ ఆఫీసు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో జరిగిన తోపులాటలో ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. అలాగే పలువురు బీజేపీ కార్యకర్తలకు కూడా గాయాలైనట్లు సమాచారం.

భారీగా పోలీసుల మోహరింపు

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీజీపీ ఆఫీసు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. "మా అభ్యర్థిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులను వదిలే ప్రసక్తే లేదు" అని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు నినాదాలు చేశారు. ఈ ఘటనతో లక్డీకపూల్ పరిసరాల్లో కాసేపు ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

https://x.com/NewsMeter_In/status/2021127137407926345

Advertisement

తాజావార్తలు

Advertisement