త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | గాజుల‌రామారంలో 100 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ బ‌స్ టెర్మిన‌ల్ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కూక‌ట్‌ప‌ల్లిలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు గాజుల‌రామారంలో 100 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ బ‌స్ టెర్మిన‌ల్ క‌ట్ట‌బోతున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Jun 8, 2026, 8.05 pm IST

CM Revanth Reddy | గాజుల‌రామారంలో 100 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ బ‌స్ టెర్మిన‌ల్ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కూక‌ట్‌ప‌ల్లిలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు గాజుల‌రామారంలో 100 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ బ‌స్ టెర్మిన‌ల్ క‌ట్ట‌బోతున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( CMC) పరిధిలో రూ. 1674.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

నియోపోలిస్ వ‌ర‌కు మెట్రో

ఈ బ‌స్ టెర్మిన‌ల్ ప‌నుల‌ను మూడు నెల‌ల్లోపు ప్రారంభించుకుంటాం. బ‌స్సుల బెడ‌ద నుంచి కాపాడుతాం. ట్రాఫిక్ స‌మ‌స్య లేకుండా చేస్తాం. మెట్రో రాయ‌దుర్గం వ‌ర‌కు ఆగిపోయింది. నియోపోలిస్ వ‌ర‌కు మెట్రోను విస్త‌రించుకుందాం. ఈ ఏరియాలో రూ. 200 కోట్ల‌కు పైగా ఎక‌రం ప‌లుకుతోంది.. కాబ‌ట్టి మౌలిక వ‌స‌తులు అవ‌స‌రం. విశ్వ‌న‌గ‌రం అని చెప్పుకుంటే స‌రిపోదు స‌దుపాయాలు క‌ల్పించాలి అని సీఎం అన్నారు.

ల‌క్ష ఎల్ఐజీ, ఎంఐజీ ఇండ్లు

ల‌క్ష ఎల్ఐజీ, ఎంఐజీ ఇండ్లు క‌ట్టి పేద‌ల‌ను భాగ‌స్వామ్యం చేసి అల్పాదాయ వ‌ర్గాల‌కు కేటాయించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాం. పేద‌ల క‌ష్టాలు తెలుసు. రాజీవ్ స్వగృహ మీద పేద‌ల‌కు ఇండ్లు అందించాం. ఏ ప్రాంతంలో ఉన్న‌వారికి ఆ ప్రాంతంలో ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తాం. న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న‌వారికి శివార్ల‌లో క‌ట్టిస్తే వారు రాలేరు.. పంచాయితీలు అవుతున్నాయి. ప్ర‌భుత్వ భూముల‌ను సేక‌రిస్తున్నాం.. క‌బ్జాల నుంచి విడిపిస్తున్నాం.. ఎంఐజీ ఎల్ఐజీ ఇండ్లు క‌ట్టించి ఇస్తాం అని సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement