CP Ramesh | ట్రాఫిక్‌పై ఆలోచించండి.. పరిష్కారాలు చెప్పండి.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ సదస్సు..!
CP Ramesh | ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేశ్ పిలుపునిచ్చారు. ‘థింక్ ట్రాఫిక్.. టాక్ ట్రాఫిక్’, ‘మూవ్ పీపుల్.. నాట్ వెహికల్స్’ నినాదాలతో రేపటి (నవంబర్ 26) నుంచి మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
CP Ramesh | ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేశ్ పిలుపునిచ్చారు. ‘థింక్ ట్రాఫిక్.. టాక్ ట్రాఫిక్’, ‘మూవ్ పీపుల్.. నాట్ వెహికల్స్’ నినాదాలతో రేపటి (నవంబర్ 26) నుంచి మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం సీఎంసీ కమిషనర్ డాక్టర్ జీ సృజనతో కలిసి ఆయన వివరాలు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీస్, సీఎంసీ, ట్రాఫిక్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సును డీజీపీ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. అంతర్జాతీయ రవాణా నిపుణుడు, ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మ, బొగోటా మేయర్ హాజరుకానున్నారు.
ప్రజా రవాణాకు ప్రాధాన్యం
లండన్‌లో 97 శాతం మంది ప్రజా రవాణాను వినియోగిస్తున్నారని, అక్కడ 9 వేల బస్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయని సీపీ తెలిపారు. తెలంగాణలో మాత్రం 74 శాతం మంది వ్యక్తిగత ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో బస్సుల కొరత, లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యల పరిష్కారానికి ఆర్టీసీతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ఏటా వెయ్యి కొత్త బస్సుల చొప్పున నాలుగైదేళ్లలో ప్రవేశపెట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇందులో ఈవీ, ఏసీ బస్సులు కూడా ఉంటాయని వివరించారు. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే 1,172 మంది వ్యక్తులు, 174 మంది వాలంటీర్లు, 93 పాఠశాలలు, 27 కళాశాలలు, 113 సంస్థలు, 62 ఆర్‌డబ్ల్యూఏలు, 21 స్వచ్ఛంద సంస్థలు నమోదు చేసుకున్నాయని సీపీ తెలిపారు. టీ-హబ్ ద్వారా 28 స్టార్టప్‌లు, కంపెనీలు భాగస్వాములవుతున్నాయని చెప్పారు. వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యూఆర్‌ఐ) నాలెడ్జ్, డేటా భాగస్వామిగా వ్యవహరిస్తోందన్నారు. రద్దీ నియంత్రణకు ఈవెంట్ యాప్ ద్వారా సమయ స్లాట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్యానెల్ చర్చలు, ప్రత్యేక సెషన్లు, ఐడియాథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు సీఎం బహుమతులు అందజేస్తారని పేర్కొన్నారు.
పౌరుల అభిప్రాయాలకే పెద్దపీట
వేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్, పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ ప్రధాన సవాలుగా మారిందని సీఎంసీ కమిషనర్ డాక్టర్ జీ సృజన అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ శాఖలతో పాటు పౌరుల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. సైబరాబాద్ మూవ్స్ కేవలం అధికారుల ప్రసంగాలకే పరిమితం కాదని, నిత్యం ప్రయాణించే ప్రజలు, నిపుణుల అభిప్రాయాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఆచరణాత్మక పరిష్కారాలను అందరి భాగస్వామ్యంతో రూపొందించడమే లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో ఇతర మహానగరాల తరహాలో ట్రాఫిక్ స్తంభన ఏర్పడకుండా ఇప్పటి నుంచే పరిష్కారాలపై చర్చించాలని సీపీ రమేష్ మీడియా, పౌరులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీపీలు సీహెచ్ శ్రీనివాస్, రితిరాజ్‌తో పాటు జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?
నవంబర్ 25, 2026

Satvika Veeravalli | కార్పొరేట్ కొలువు నుంచి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్.. హాట్ టాపిక్‌గా మారిన టాలీవుడ్ బ్యూటీ!
నవంబర్ 25, 2026

Sreeleela | శ్రీలీలకు వరుస ఫ్లాపులు..! కెరీర్లో అసలేం జరుగుతోంది?
నవంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. నవంబర్ 26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Global Summit | గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం.. కీరవాణి ఆధ్వర్యంలో సమ్మిట్ ఆంథమ్ రూపకల్పన
- ●Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మరో సాక్ష్యం!
- ●Christmas | తెలంగాణలోని ప్రతి చర్చికి రూ. 30 వేల సాయం
- ●Actor Prabhas | ఫ్యూచర్ సిటీలో ప్రభాస్‌కు 500 ఎకరాలు..?

Traffic Restrictions | బీ అలర్ట్.. నవంబర్ 26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Global Summit | గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం.. కీరవాణి ఆధ్వర్యంలో సమ్మిట్ ఆంథమ్ రూపకల్పన

Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?

Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మరో సాక్ష్యం!



