త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?

Shraddha Kapoor | బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఈథా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణ్‌గావ్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

P

Entertainment | Published On Nov 25, 2026, 7.45 pm IST

Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?
Advertisement

Shraddha Kapoor | బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఈథా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణ్‌గావ్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందే శ్రద్ధా కపూర్ నటనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇప్పటివరకు విడుదలైన ట్రైల‌ర్ల‌లో ఆమె డైలాగ్ డెలివరీపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విఠాబాయి వంటి గొప్ప కళాకారిణి పాత్రలో శ్రద్ధా కపూర్ కనిపించనుండటంతో ఆమెపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ప్రచార కంటెంట్‌లో ఆమె పలికిన సంభాషణలు పాత్రకు తగిన గాంభీర్యాన్ని ప్రతిబింబించడం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. పాత్రలోని భావోద్వేగాలను, తీవ్రతను ఆమె డైలాగ్ డెలివరీలో పూర్తిస్థాయిలో చూపించలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ట్రైల‌ర్ల‌లో కొన్ని సన్నివేశాలను చూసి శ్రద్ధా నటనపై ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంద‌ని.. సినిమా విడుదలైన తర్వాతే ఆమె పాత్రను ఎంతవరకు పండించారో తెలుస్తుంద‌ని పేర్కొంటున్నారు. విమర్శలకు తన నటనతో సమాధానం చెబుతారా? విఠాబాయి పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ సినిమా విడుదల తేదీలోనూ మార్పు చోటుచేసుకుంది. తొలుత యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంతో పోటీగా విడుదల చేయాలని భావించినప్పటికీ, మేకర్స్ తర్వాత ‘ఈథా’ రిలీజ్‌ను డిసెంబర్ 4కు మార్చారు. ఇక ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌తో పాటు రణ్‌దీప్ హుడా, మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విఠాబాయి జీవితంలోని విశేషాలను వెండితెరపై ఎలా ఆవిష్కరించారో, శ్రద్ధా కపూర్ తన నటనతో ఎలాంటి ముద్ర వేస్తారో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement