త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bakrid Preparations Hyderabad | బక్రీద్ పండుగకు సైబరాబాద్ పోలీసుల భారీ ఏర్పాట్లు.. జంతు వ్యర్థాల నిర్వహణపై సీపీ కీలక ఆదేశాలు

రాబోయే బక్రీద్ పండుగను ప్రశాంతంగా, పరిశుభ్రంగా జరుపుకోవాలని సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్ సూచించారు. వ్యర్థాల నిర్వహణపై అధికారులకు ఆయన ఇచ్చిన కీలక ఆదేశాలివే.

J

Hyderabad | Published On May 26, 2026, 10.30 pm IST

Bakrid Preparations Hyderabad | బక్రీద్ పండుగకు సైబరాబాద్ పోలీసుల భారీ ఏర్పాట్లు.. జంతు వ్యర్థాల నిర్వహణపై సీపీ కీలక ఆదేశాలు
Advertisement
  • బక్రీద్ పండుగ ముందస్తు ఏర్పాట్లపై మున్సిపల్, రెవెన్యూ, వెటర్నరీ అధికారులతో సైబరాబాద్ సీపీ జూమ్ మీటింగ్
  • జంతు వ్యర్థాల సక్రమ నిర్వహణ, పారిశుధ్యంపై సమావేశంలో ప్రధానంగా చర్చ
  • వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నల్ల పాలిథిన్ కవర్లలోనే సేకరించాలని అధికారులకు, ప్రజలకు స్పష్టీకరణ
  • క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక అధికారుల నియామకం

Bakrid Preparations Hyderabad | త్రినేత్ర.న్యూస్ : రాబోయే బక్రీద్ (Bakrid) పండుగ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) ముందస్తు చర్యలు చేపట్టారు. పండుగను ప్రశాంత వాతావరణంలో, పరిశుభ్రంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (Cyberabad CP) డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ (CMC), వెటర్నరీ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి జూమ్ మీటింగ్ (Zoom meeting) జరిగింది.

పారిశుధ్యంపై స్పెషల్ ఫోకస్

ఈ సమావేశంలో ప్రధానంగా పారిశుధ్యం (Sanitation), జంతు వ్యర్థాల (Animal waste) నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈద్గాలు, మసీదులు, నివాస ప్రాంతాల వద్ద వ్యర్థాలను సేకరించేందుకు మందపాటి నల్ల పాలిథిన్ కవర్లను (Black polythene covers) వాడాలని నిర్ణయించారు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను, వాటర్ ట్యాంకర్లను (Water tankers) సిద్ధంగా ఉంచాలని సీపీ అధికారులను ఆదేశించారు. పండుగ పూట దుర్వాసన రాకుండా ఎక్కడికక్కడ బ్లీచింగ్ పౌడర్ (Bleaching powder) చల్లుతూ పరిశుభ్రతను కాపాడాలని స్పష్టం చేశారు.

Cyberabad CP Issues Key Guidelines for Peaceful Bakrid Celebrations

నిబంధనలు పాటించండి: సీపీ విజ్ఞప్తి

సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ.. ప్రజలంతా పండుగను సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ వేళ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జంతు వ్యర్థాలను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా అధికారులు సూచించిన విధంగా కవర్లలోనే సేకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యర్థాల తొలగింపు ప్రక్రియలో మున్సిపల్, రెవెన్యూ, వెటర్నరీ శాఖలు పూర్తి కోఆర్డినేషన్ (Coordination) తో పనిచేయాలని సూచించారు.

ప్రతి స్టేషన్‌కు ఓ స్పెషల్ ఆఫీసర్

పండుగ సమయంలో పబ్లిక్ నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించేందుకు, ప్రతి పోలీస్ స్టేషన్ (Police Station) స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. వీరు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారన్నారు. పోలీసులు, అధికారులకు ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.

ఈ ఉన్నత స్థాయి భేటీలో ఎస్బీ డీసీపీ సుధీంద్ర, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్, సీఏఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ సంజీవ్ సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్‌హెచ్‌వోలు (SHOs) పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement