CP Sajjanar | సాంస్కృతిక సామరస్యానికి ప్రతీక ‘నాడహబ్బ’
CP Sajjanar | భిన్న సంస్కృతుల నిలయమైన హైదరాబాద్‌లో కన్నడిగులు జరుపుకునే ‘నాడహబ్బ’ వేడుకలు భాషా సామరస్యానికి అద్దం పడుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పేర్కొన్నారు.
కర్ణాటక సాహిత్య మందిరలో వైభవంగా ఉత్సవాల ప్రారంభం
ముఖ్య అతిథిగా హాజరైన నగర సీపీ వీసీ సజ్జనర్
CP Sajjanar | త్రినేత్ర న్యూస్ : భిన్న సంస్కృతుల నిలయమైన హైదరాబాద్‌లో కన్నడిగులు జరుపుకునే ‘నాడహబ్బ’ వేడుకలు భాషా సామరస్యానికి అద్దం పడుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పేర్కొన్నారు. కాచిగూడలోని చారిత్రక కర్ణాటక సాహిత్య మందిరలో 91వ వార్షిక ‘నాడహబ్బ’ (దసరా) మహోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ సభకు నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు, మరోవైపు కర్ణాటకలో నాడహబ్బ వేడుకలు జరుగుతున్న ఈ దసరా నవరాత్రుల వేళ.. హైదరాబాద్‌లో ఈ రెండు సంస్కృతుల కలయికను చూడటం ఎంతో ముచ్చటగా ఉందన్నారు. భారతీయ సాహిత్యంలో కన్నడ సాహిత్యానికి విశిష్ట స్థానముందని, తెలుగు–కన్నడ సంస్కృతుల మధ్య శతాబ్దాల బలమైన బంధం ఉందని గుర్తుచేశారు.

హైదరాబాద్ సంస్కృతి, సంస్కరణలు, నగర అభివృద్ధిలో కన్నడిగుల పాత్ర ప్రముఖమైనదని పేర్కొన్నారు. స్వామి రామానంద తీర్థ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాళోజీ నారాయణరావు వంటి ఎందరో మహనీయులు ఈ ప్రాంత ప్రగతికి విశేష సేవలందించారని గుర్తుచేశారు. ఇక్కడి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఎంతోమంది కర్ణాటకలో ఉన్నత స్థానాలను అధిరోహించారని వివరించారు. 1936లో ఏర్పాటైన కర్ణాటక సాహిత్య మందిర గత తొమ్మిది దశాబ్దాలుగా తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ ప్రజల మధ్య వారధిగా నిలుస్తోందని కొనియాడారు. నగరంలో కన్నడిగులు శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ వేడుకల్లో నృపతుంగ విద్యాసంస్థలు, శారదా కర్ణాటక కన్య పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ విశ్రాంత న్యాయసభ్యులు, కర్ణాటక శిక్షణ సమితి అధ్యక్షుడు సుధేంద్ర కులకర్ణి, కర్ణాటక సాహిత్య మందిర అధ్యక్షుడు సురేంద్ర కాట్గేరి, కార్యదర్శి నరసింహమూర్తి జోయిస్, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు నగర కన్నడ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Jaggareddy | రాహుల్ గాంధీకి మద్దతుగా మనం వీధుల్లోకి రావాల్సిందే
అక్టోబర్ 12, 2026

APP Results | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల.. 17 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
అక్టోబర్ 12, 2026

MLC Dasoju Sravan Kumar | రూ.700 కోట్ల ఆలయ ప్రాజెక్ట్.. 948 కోట్లెందుకైంది?
అక్టోబర్ 12, 2026
తాజావార్తలు
- ●Jaggareddy | రాహుల్ గాంధీకి మద్దతుగా మనం వీధుల్లోకి రావాల్సిందే
- ●CJI Surya Kant | రాహుల్, ఖర్గేలకు సీజేఐ షాక్: వ్యక్తిగత భేటీ కుదరదు.. న్యాయ నైతికతకు విరుద్ధమంటూ సూర్యకాంత్ కీలక లేఖ
- ●APP Results | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల.. 17 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
- ●MLC Dasoju Sravan Kumar | రూ.700 కోట్ల ఆలయ ప్రాజెక్ట్.. 948 కోట్లెందుకైంది?
- ●Tirumala Brahmotsavam | వాహనసేవ.. వైకుంఠనాథుడి వైభవానికి ప్రతిరూపం!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. తీవ్ర ఒత్తిడిలో సూచీలు..

Jaggareddy | రాహుల్ గాంధీకి మద్దతుగా మనం వీధుల్లోకి రావాల్సిందే

CJI Surya Kant | రాహుల్, ఖర్గేలకు సీజేఐ షాక్: వ్యక్తిగత భేటీ కుదరదు.. న్యాయ నైతికతకు విరుద్ధమంటూ సూర్యకాంత్ కీలక లేఖ

APP Results | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల.. 17 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

MLC Dasoju Sravan Kumar | రూ.700 కోట్ల ఆలయ ప్రాజెక్ట్.. 948 కోట్లెందుకైంది?



