త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Swiggy | స్విగ్గీ వర్సెస్ జొమాటో.. 84 శాతం లాభాల‌కు చాన్స్‌.. పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చా..?

Swiggy | భారత ఫుడ్ డెలివరీ మార్కెట్లో స్విగ్గీ, ఎటర్నల్ (జొమాటో) మధ్య పోటీ మరింత తీవ్రమవుతోందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టీన్ అంచనా వేసింది. స్విగ్గీ ప్రారంభించిన తక్కువ ధరల ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ టోయింగ్ వ్యాపార అవకాశాలతోపాటు, ప్రధాన ప్లాట్‌ఫామ్ ఆర్డర్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

S

Business | Published On Nov 17, 2026, 5.56 pm IST

Swiggy | స్విగ్గీ వర్సెస్ జొమాటో.. 84 శాతం లాభాల‌కు చాన్స్‌.. పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చా..?
Advertisement

Swiggy | భారత ఫుడ్ డెలివరీ మార్కెట్లో స్విగ్గీ, ఎటర్నల్ (జొమాటో) మధ్య పోటీ మరింత తీవ్రమవుతోందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టీన్ అంచనా వేసింది. స్విగ్గీ ప్రారంభించిన తక్కువ ధరల ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ టోయింగ్ వ్యాపార అవకాశాలతోపాటు, ప్రధాన ప్లాట్‌ఫామ్ ఆర్డర్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించింది. స్విగ్గీ షేరుకు రూ.350 టార్గెట్ ధరను కొనసాగిస్తూ, ప్రస్తుత స్థాయిల నుంచి దాదాపు 84 శాతం లాభానికి అవకాశం ఉందని పేర్కొంది.

స్విగ్గీ షేర్ల‌లో రానున్న ర్యాలీ..?

భారత ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ కొత్త దశకు చేరుకుంటోందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టీన్ తెలిపింది. స్విగ్గీ లిమిటెడ్, ఎటర్నల్ లిమిటెడ్ (జొమాటో) షేర్లపై ఔట్‌పెర్ఫార్మ్ రేటింగ్‌ను కొనసాగించింది. స్విగ్గీ షేరుకు రూ.350 టార్గెట్ ధరను నిర్ణయించింది. గ‌త సెష‌న్ ముగింపు ధరతో పోలిస్తే ఇది దాదాపు 84 శాతం పెరిగే అవకాశాన్ని సూచిస్తోంది. అయితే స్విగ్గీ కొత్తగా ప్రారంభించిన తక్కువ ధరల ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ టోయింగ్ వ్యాపార నమూనాపై కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది. టోయింగ్ కారణంగా స్విగ్గీ ప్రధాన ప్లాట్‌ఫామ్‌లోని ఆర్డర్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. టోయింగ్ ద్వారా ఒక్కో ఆర్డర్‌పై నిర్వహణ ఖర్చును ప్రస్తుత రూ.115 నుంచి రూ.65-75కు తగ్గించవచ్చని, ఆదాయం మాత్రం ఒక్కో ఆర్డర్‌కు రూ.130-135 నుంచి రూ.70-80కు తగ్గుతుంద‌ని అంచనా వేసింది. అధిక ఆర్డర్లను కలిపి డెలివరీ చేయడం, డెలివరీ ఖర్చులు తగ్గించడం, ప్రకటనల ద్వారా ఆదాయం పొందడం వంటి అంశాలతో టోయింగ్ చివరకు సుమారు 3 శాతం ఈబీఐటీడీఏ మార్జిన్ సాధిస్తుంద‌ని బెర్న్‌స్టీన్ అభిప్రాయపడింది.

ఎట‌ర్న‌ల్ షేర్లు న‌ష్టాల్లోకి..?

అయితే టోయింగ్‌కు వచ్చే ఆర్డర్లలో 26-30 శాతం వరకు స్విగ్గీ ప్రధాన ప్లాట్‌ఫామ్ నుంచి మళ్లితే, 2026-27 నుంచి 2030 ఆర్థిక సంవత్సరాల మధ్య ఫుడ్ డెలివరీ వ్యాపార వృద్ధికి అదనంగా 3-5 శాతం పాయింట్లు అవసరమవుతాయని బ్రోకరేజ్ పేర్కొంది. ప్రస్తుతం టోయింగ్‌లో అందుబాటులో ఉన్న రెస్టారెంట్లలో ఎక్కువ భాగం స్విగ్గీ ప్రధాన ప్లాట్‌ఫామ్‌లోనూ ఉన్నాయని తెలిపింది. దీంతో కొత్త కస్టమర్లను ఆకర్షించకుండా, ఇప్పటికే ఉన్న వినియోగదారులు తక్కువ ధరల ప్లాట్‌ఫామ్‌కు మారే ప్రమాదం ఉందని విశ్లేషించింది. మరోవైపు ఎటర్నల్‌పై కూడా ఔట్‌పెర్ఫార్మ్ రేటింగ్‌ను కొనసాగించినప్పటికీ, రూ.350 టార్గెట్ ధరను కొనసాగించింది. గ‌త సెష‌న్ ముగింపు ధరతో పోలిస్తే ఇది దాదాపు 6 శాతం నష్టాన్ని సూచిస్తోంది.

రానున్న 2 ఏళ్లు కీల‌కం..

పెరుగుతున్న పోటీ కారణంగా ప్రకటనలు, ప్రమోషన్లపై ఖర్చులు అధికంగానే ఉండడంతో రానున్న ఒకటి నుంచి రెండేళ్లలో ఎటర్నల్ ఫుడ్ డెలివరీ ఈబీఐటీడీఏ మార్జిన్లు పెద్దగా మెరుగుపడవని అంచనా వేసింది. బ్లింకిట్ వృద్ధి ఎటర్నల్‌కు సానుకూలంగా ఉన్నప్పటికీ, స్విగ్గీ టోయింగ్, రాపిడోతోపాటు కొత్త సంస్థల ప్రవేశం ఫుడ్ డెలివరీ లాభదాయకతపై ఒత్తిడి పెంచుతాయ‌ని హెచ్చరించింది. ఎటర్నల్‌కు చెందిన బిస్ట్రో ప్రాజెక్టు అమలులోనూ సవాళ్లు ఉంటాయ‌ని పేర్కొంది. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ-కామర్స్ రంగాలు కలిసిపోతున్న ఈ కొత్త వ్యాపార ధోరణిని బెర్న్‌స్టీన్ సూపర్ ఆప్స్ గా అభివర్ణించింది. ప్రస్తుత విలువల ప్రకారం స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం తక్కువ అంచనా వేయబడుతోందని, అయితే టోయింగ్‌పై పెట్టుబడులు, దీర్ఘకాలిక వ్యూహంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది.

Advertisement
Advertisement