CM Revanth Reddy | నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాదిరిగానే.. నాలుగో నగరంగా భాతర్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచంలోని అద్భుతమైన నగరాలతో పోటీ పడి.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాదిరిగానే.. నాలుగో నగరంగా భాతర్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచంలోని అద్భుతమైన నగరాలతో పోటీ పడి.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు శంకుస్థాపన సందర్భంగా సీఎం ప్రసంగించారు.
జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్, న్యూయార్క్, ట్యోకో వంటి నగరాలను ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఆ నగరాలతో పోటీ పడే విధంగా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తాం. మహేశ్వరం పరిధిలో ఈ ఫ్యూచర్ సిటీని భవిష్యత్ తరాలకు గొప్పగా అందిస్తాం అని సీఎం తెలిపారు.
రోడ్లకు సంబంధించి, ఫ్యూచర్ సిటీ కార్యాలయం, స్కిల్స్ వర్సిటీ, కమిషనరేట్ కావొచ్చు. అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలంటే నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణ అందించాలి. దీంతోనే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ కట్టుకుంటున్నాం.. హైదరాబాద్, సైబరాబాద్‌లో కాదు.. ఫ్యూచర్ సిటీలోనే ఒప్పందాలు చేయాలని కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నాం. జూన్ 2 లోపే దాన్ని ప్రారంభించుకుంటామని సీఎం తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్ చూశారు. ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ సంస్థలను రప్పించడమే కాకుండా.. విశ్వాసం కల్పించాం. అనుకూలమైన ప్రాంతంతో పాటు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలోనే ఈ ఫ్యూచర్ సిటీ ఉందని చెప్పాం. అధికారులు నిరంతరం శ్రమించి గ్లోబల్ సమ్మిట్‌ను అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచ కంపెనీలకు మనపై విశ్వాసం కలిగింది. త్వరలోనే పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం పేర్కొన్నారు.
సైబరాబాద్, హైటెక్ సిటీ, ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ మీకళ్ల ముందున్నాయి. ఇవన్నీ ఒక ఊహ చిత్రంగా మొదలైనాయి. నాయకులను అవహేళన చేశారు. ఏడంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు.. సాధ్యం అవుతాయా..? అని ఆనాటి నాయకులు అవహేళన చేసే విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు నిజమైంది. ఈ దేశంలోనే 160 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు ఏ నగరానికి లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరానికి ఇంత అద్భుతమైన ఆస్తి లేదు అని సీఎం తెలిపారు.
మన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ప్రపంచంతో పోటీ పడుతోంది. ఫార్మా, ఐటీ కంపెనీలు నంబర్‌వన్‌గా ఉన్నాయి. జీనోమ్ వ్యాలీ నుంచి మూడు వ్యాక్సిన్లు అందించాం. ఐటీ, డిఫెన్స్ ఎగుమతులు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. రాఫెల్ యుద్ధ విమానం సర్వీసెస్ సెంటర్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉంది. హైదరాబాద్ నగరానికి ఎన్నో సక్సెస్ స్టోరీలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





