Malka Komuraiah | ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలి
Malka Komuraiah | తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
హర్యానా విధానాలను అమలు చేయాలి
అథ్లెటిక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి
ఖేలో ఇండియా, శాయ్ నిధులను వినియోగించాలి
మైసూర్ తరహాలో సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్
ప్రతి పాఠశాలలో ప్లే గ్రౌండ్, పీఈటీ తప్పనిసరిగా ఉండాలి
శాసనమండలిలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
Malka Komuraiah | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శాసనమండలిలో క్రీడారంగంపై జరిగిన చర్చలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
హర్యానా రాష్ట్రంలో అమలవుతున్న క్రీడా విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మెరుగైన స్పోర్ట్స్ మోడల్‌ను రూపొందించాలని సూచించారు. ఇండోర్, అవుట్‌డోర్ క్రీడలతో పాటు అథ్లెటిక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఖేలో ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన స్థలాన్ని కేటాయిస్తే మై సూర్ తరహాలో ఆధునిక సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసు కునే అవకాశం ఉందన్నారు.
క్రీడా హాస్టళ్లలోని క్రీడాకారులకు వారి శారీరక అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ప్రత్యేక డైట్ అందించాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ప్రోత్సాహకాలను పూర్తిస్థాయిలో అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్లేగ్రౌం డ్, పీఈటీ ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. పీఈటీ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు జిల్లాల్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతోందని, అదే స్ఫూర్తితో తెలంగాణను కూడా క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన బడ్జెట్, మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు.
తాజావార్తలు
- ●OU Students Protest | లక్ష డప్పులతో వస్తాం.. ఖబడ్దార్!
- ●Oracle | ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్.. ఇందుకోసం 700 మిలియన్ డాలర్ల ఖర్చు
- ●Vakiti Srihari | తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం
- ●Ameesha Patel | బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం - పనిమనిషి అరెస్ట్
- ●Gangula Kamalakar in role of Ponguleti | కాంగ్రెస్ గెలవాలని మస్తు ఖర్సువెట్టిన.. ఇప్పుడవన్నీ సంపాదించొద్దా
- ●OpenAI | ఆర్థిక సేవలను అందించనున్న చాట్ జీపీటీ.. ఓపెన్ఏఐ కొత్త ఫీచర్..

OU Students Protest | లక్ష డప్పులతో వస్తాం.. ఖబడ్దార్!

Oracle | ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్.. ఇందుకోసం 700 మిలియన్ డాలర్ల ఖర్చు

Vakiti Srihari | తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం

Ameesha Patel | బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం - పనిమనిషి అరెస్ట్





