Oracle | ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్.. ఇందుకోసం 700 మిలియన్ డాలర్ల ఖర్చు
Oracle | అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ (Oracle) మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది (more job cuts). నిధుల ఆదా కోసం ఈ ఏడాదే వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన ఒరాకిల్.. త్వరలోనే మరొక విడత కోతలకు సిద్ధమవుతోంది.
Oracle | త్రినేత్ర.న్యూస్ : అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ (Oracle) మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది (more job cuts). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ఈ టెక్ దిగ్గజం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఒరాకిల్ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఏఐ కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంస్థకు దాదాపు 156 బిలియిన్ డాలర్లు అవసరం ఉంది. ఈ ఖర్చులు ఇప్పుడు కంపెనీ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ ఏఐ వంటి ప్రముఖ కంపెనీల కోసం భారీ డేటా సెంటర్లను నిర్మిస్తుండటంతో ఒరాకిల్‌పై ఆర్థిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడంతో పాటు నగదు నిల్వలను కాపాడుకునేందుకు ఒరాకిల్ లేఆఫ్స్ వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వేలాది మందిపై వేటు వేసిన సంస్థ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2026 నాటికి తన రీస్ట్రక్చరింగ్ ప్రణాళికల వ్యయం ఏకంగా రూ.26 వేల కోట్లకు చేరుతుందని (2.8 బిలియన్ డాలర్లు) ఒరాకిల్ తాజాగా బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఇందులో అత్యధికంగా ఉద్యోగుల కోతకే వెచ్చించినట్లు తెలిపింది. ఇప్పటికే ఈ ప్రణాళిక కింద దాదాపు 2.1 బిలియన్ డాలర్ల ఖర్చు చేయగా.. రాబోయే రోజుల్లో చేపట్టనున్న అదనపు ఉద్యోగ కోతల కోసం మరో 700 మిలియన్ డాలర్లను కేటాయించనుంది.
నిధుల ఆదా కోసం ఈ ఏడాదే వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన ఒరాకిల్.. త్వరలోనే మరొక విడత కోతలకు సిద్ధమవుతోందని బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొంది. కాగా, ఒరాకిల్‌లో గతేడాది సుమారు 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది మే 31 నాటికి ఆ సంఖ్య 1,41,000కు పడిపోయింది. ఇందులో 49,000 మంది అమెరికా ఉద్యోగులు కాగా, అంతర్జాతీయంగా దాదాపు 92 వేల మంది పనిచేస్తున్నారు. గడిచిన 12 నెలల్లోనే సంస్థ 21వేల మందిని తొలగించడం గమనార్హం.
Also Read..
తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం
కాంగ్రెస్ గెలవాలని మస్తు ఖర్సువెట్టిన.. ఇప్పుడవన్నీ సంపాదించొద్దా
ఈ ఐదు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
తాజావార్తలు
- ●Ameesha Patel | బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం - పనిమనిషి అరెస్ట్
- ●Gangula Kamalakar in role of Ponguleti | కాంగ్రెస్ గెలవాలని మస్తు ఖర్సువెట్టిన.. ఇప్పుడవన్నీ సంపాదించొద్దా
- ●OpenAI | ఆర్థిక సేవలను అందించనున్న చాట్ జీపీటీ.. ఓపెన్ఏఐ కొత్త ఫీచర్..
- ●TG Weather | ఈ ఐదు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ●GHMC Sports Grounds Privatization | పేద, మధ్యతరగతి పిల్లలకు ఆట స్థలాలను దూరం చేస్తారా?
- ●Trisha | దళపతి విజయ్ విజయ్ మీటింగ్ - త్రిష షూటింగ్ - ఇద్దరూ లండన్‌లోనే!

Ameesha Patel | బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం - పనిమనిషి అరెస్ట్

Gangula Kamalakar in role of Ponguleti | కాంగ్రెస్ గెలవాలని మస్తు ఖర్సువెట్టిన.. ఇప్పుడవన్నీ సంపాదించొద్దా

OpenAI | ఆర్థిక సేవలను అందించనున్న చాట్ జీపీటీ.. ఓపెన్ఏఐ కొత్త ఫీచర్..

TG Weather | ఈ ఐదు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ





