త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఓంకారేశ్వ‌ర ఆల‌య నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌

CM Revanth Reddy | మూసీ న‌ది పున‌రుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వ‌ద్ద ఓంకారేశ్వ‌ర ఆల‌య నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. శృంగేరి శారదాపీఠం సూచనల మేరకు ఆలయ నిర్మాణం చేప‌డుతున్నారు.

S

Hyderabad | Published On Mar 28, 2026, 10.32 am IST

CM Revanth Reddy | ఓంకారేశ్వ‌ర ఆల‌య నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ న‌ది పున‌రుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వ‌ద్ద ఓంకారేశ్వ‌ర ఆల‌య నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. శృంగేరి శారదాపీఠం సూచనల మేరకు ఆలయ నిర్మాణం చేప‌డుతున్నారు. అంత‌కుముందు మ‌చిలేశ్వ‌ర‌ వీరభద్రస్వామి ఆలయం వద్ద కుటుంబసమేతంగా గోపూజ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గోశాల నిర్మాణానికి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌తో క‌లిసి సీఎం రేవంత్ శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రూ. 700 కోట్ల‌తో మూసీ ఆధ్యాత్మిక ప్రాజెక్టును చేప‌ట్ట‌నున్నారు. మూసీ నది మధ్యలో 100 అడుగులు భారీ శివుడి విగ్రహం నిర్మించ‌నున్నారు. ఈ న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో 4 మతాల ప్రార్థన మందిరాలు నిర్మించ‌నున్నారు. పురానాపూల్ వద్ద మసీదు, గౌలిగూడలో గురుద్వారా నాగోల్ వద్ద చర్చి నిర్మించాలని నిర్ణయం చేశారు.

https://www.youtube.com/live/KRHanVHxtfE

Advertisement

తాజావార్తలు

Advertisement