Forum For Good Governance | ఏ ఎమ్మెల్యే కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు
Forum For Good Governance | రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లక్షల రూపాయాల్లో ప్రతి నెల జీతాలు పొందుతున్నప్పటికీ.. ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది.
Forum For Good Governance | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లక్షల రూపాయాల్లో ప్రతి నెల జీతాలు పొందుతున్నప్పటికీ.. ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు సుమారు రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పారితోషికాన్ని పొందుతున్నారు. అయితే వారి మూలవేతనం కేవలం రూ. 20 వేలు చూపిస్తూ మిగిలిన మొత్తాన్ని వివిధ పన్ను మినహాయింపు కలిగిన భత్యాలుగా చూపించడమే అని పేర్కొంది.
శాసనమండలి ఛైర్మన్‌కు నెలకు రూ.4,11,000 చేతికి వచ్చే పారితోషికం ఉన్నప్పటికీ, ఆయన ఆదాయపు పన్ను చెల్లించడం లేదు. దీనికి కారణం ఆయన వేతనం కేవలం రూ.41,000లుగా చూపిస్తూ, మిగిలిన మొత్తాన్ని పన్ను పరిధిలోకి రాని వివిధ భత్యాలుగా చూపించడం. ఈ విధమైన ఏర్పాటు వాస్తవానికి ఆదాయపు పన్ను చెల్లింపును తప్పించుకునే విధానంగా ఉంది అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
భారత రాజ్యాంగంలో విప్ (Whip) పదవికి ఎటువంటి రాజ్యాంగపరమైన నిబంధన లేదు. అయినప్పటికీ, ఓటింగ్ సమయంలో శాసనసభ్యుల హాజరును నిర్ధారించడానికి, అలాగే సాధారణ సమన్వయం కోసం రాజకీయ పార్టీలు విప్‌లను నియమిస్తున్నాయి. ఆసక్తికరంగా, అధికార పార్టీ ఆరుగురు విప్‌లను నియమించింది. వీరికి నెలకు సుమారు రూ.4,00,000 వరకు పారితోషికం లభిస్తున్నప్పటికీ, వారి వేతనం కేవలం రూ.20,000గా చూపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జి.ఓ. నం.1064 ద్వారా ముగ్గురు విప్‌లకు మంత్రుల హోదాను కల్పించింది.
Payment of Salaries Act, 1953లోని సెక్షన్ 3(4) ప్రకారం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు వారి వేతనం, భత్యాలు, ఇతర సదుపాయాలకు సంబంధించి చెల్లించవలసిన ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ నిబంధన చట్టం ముందు సమానత్వం అనే ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉండటమే కాకుండా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుంది. దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ నిబంధనను తొలగించాయి. అయితే తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఈ నిబంధనను కొనసాగిస్తున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది.
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచనలు:
- Payment of Salaries Act, 1953 లోని సెక్షన్ 3( 4) ను తొలగించాలి.
- ఆదాయపు పన్ను చెల్లింపును తప్పించుకునేందుకు వేతనాన్ని తక్కువగా చూపించి, పన్ను పరిధిలోకి రాని ఇతర భత్యాలు, ప్రయోజనాలను అధికంగా చూపించే విధానాన్ని క్రమబద్ధీకరించాలి.
- విప్‌లకు రాష్ట్ర మంత్రుల హోదా కల్పించే విధానాన్ని ఉపసంహరించుకోవాలి.
- ప్రతి రాజకీయ పార్టీకి ఒక్క విప్‌ను మాత్రమే నియమించే విధానాన్ని అమలు చేయాలి.
తాజావార్తలు
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి
- ●Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..

MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం




