TG High Court | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ తాత్కాలిక స్టే
TG High Court | హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కమిషనర్ పదవి నుంచి ఆయనను తప్పించాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతానికి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
TG High Court | హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కమిషనర్ పదవి నుంచి ఆయనను తప్పించాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతానికి రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. హైడ్రా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కమిషనర్ స్థాయిలో డీజీ హోదా కలిగిన ఉన్నతాధికారిని నియమించడం సముచితమని సింగిల్ బెంచ్ గత విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రంగనాథ్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
తన నియామకానికి సంబంధించిన అంశాలతో పాటు సింగిల్ బెంచ్ ఆదేశాలను ఆయన అప్పీల్‌లో ప్రస్తావించారు. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సింగిల్ బెంచ్ ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగనున్నారు. కేసులో తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటివరకు సింగిల్ బెంచ్ ఆదేశాలపై ఇచ్చిన తాత్కాలిక నిలుపుదల అమల్లో ఉండనుంది. హైడ్రా ఆధ్వర్యంలో నగరంలో కొనసాగుతున్న చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు తదితర కార్యక్రమాలపై తాజా ఉత్తర్వుల ప్రభావం ఉండదని భావిస్తున్నారు.
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్






