Chinna Reddy | తెలంగాణలో ద్రాక్ష సాగుకి చాలా అవకాశాలున్నాయి
తెలంగాణ రాష్ట్రంలో పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం తగిన సబ్సిడీలు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. విశ్వవిద్యాలయంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, యువతను ఉద్యాన పంటల సాగు వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉందని అన్నారు
- "జాతీయ రైతు దినోత్సవం, హార్టికల్చర్ యూనివర్సిటీ ఫౌండేషన్ డే " సదస్సు
- కూరగాయలు, పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి
-తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి
Chinna Reddy | తెలంగాణలో ద్రాక్ష సాగుకి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం కూరగాయలు, పాలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలని, తద్వారా రాష్ట్ర అవసరాలు తీరుస్తూనే, ఎగుమతి అవకాశాలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. ములుగు లోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 11వ ఫౌండేషన్ డే, జాతీయ రైతు దినోత్సవం సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్నారెడ్డి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం తగిన సబ్సిడీలు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. విశ్వవిద్యాలయంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, యువతను ఉద్యాన పంటల సాగు వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొల్లాపూర్ మామిడి, బాలానగర్ సీతాఫలం పంటలకు విశిష్టతల దృష్ట్యా వీటిపై పరిశోధన ముమ్మరం చేసి ఎగుమతుల ద్వారా రైతులకు ఆదాయం పెంచాలని సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉద్యాన ప్రాముఖ్య పాలసీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పంట సాగులో కీలకమైన విత్తనాలు డ్రిప్పు స్ప్రింక్లర్లు ఇతర వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉద్యాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూరగాయల సాగు 12 లక్షలకు పైగా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. వర్సిటీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఆధునిక కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలు, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఏఐ-ఎంఎల్, రిమోట్ సెన్సింగ్ లపై త్వరలోనే నూతన పరిశోధనలను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ రాజిరెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వర్సిటీలో విశేష సేవలందించిన బోధన, బోధనేతర సిబ్బందిని అవార్డులతో సత్కరించారు. వ్యవస్థాపక దినోత్సవం ప్రత్యేక ఉపన్యాసాన్ని డా. ఎస్.డి. శికమణి, మాజీ ఉపకులపతి, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం అందించారు. “ఉద్యానంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం” అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, ఆధునిక సాంకేతికతలు ఉద్యాన రంగ ఉత్పాదకతను పెంచడంలో కీలకంగా మారుతున్నాయని తెలిపారు. రైతులతో నిర్వహించిన పరస్పర చర్చలో కూరగాయలు, పండ్ల సాగు విస్తీర్ణం పెంపు, మార్కెట్ ధరలు, మధ్యవర్తుల కమిషన్లు వంటి అంశాలపై రైతులు తమ సమస్యలను వివరించారు. సాగుకు తగిన మద్దతు ధరలు కల్పించాల్సిన అవసరాన్ని రైతులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. భగవాన్, యూనివర్సిటీ బోధన సిబ్బంది, విద్యార్థులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



