త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chain Snatching | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వ‌ద్ద చైన్ స్నాచింగ్..

Chain Snatching | జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో దారుణం జ‌రిగింది. రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న ఓ మ‌హిళ(27) మెడ‌లో నుంచి స్నాచ‌ర్లు బంగారు గొలుసును లాక్కెళ్లారు.

S

Hyderabad | Published On Feb 18, 2026, 2.51 pm IST

Chain Snatching | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వ‌ద్ద చైన్ స్నాచింగ్..
Advertisement

Chain Snatching | త్రినేత్ర‌.న్యూస్ : జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో దారుణం జ‌రిగింది. రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న ఓ మ‌హిళ(27) మెడ‌లో నుంచి స్నాచ‌ర్లు బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో ఆందోళ‌న‌కు గురైన బాధిత మ‌హిళ జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

క‌డ‌ప జిల్లాకు చెందిన మాన‌స వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆమె మాదాపూర్‌లోని ఓ ప్ర‌యివేటు హాస్ట‌ల్‌లో నివాసం ఉంటుంది. అయితే త‌న హాస్ట‌ల్ నుంచి ఆఫీసుకు న‌డ‌క మార్గంలో వెళ్తుండ‌గా.. బైక్‌పై వ‌చ్చిన దుండ‌గులు ఆమె మెడ‌లో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న నుంచి తేరుకునే లోపే బైక‌ర్‌తో పాటు గొలుసును దొంగిలించిన మ‌హిళ అక్క‌డ్నుంచి ప‌రారీ అయ్యారు.

మాన‌స ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స‌మీపంలో ఉన్న అన్ని సీసీ టీవీ కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలించారు. త్వ‌ర‌లోనే నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement