త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FSL Fire Accident | రిక‌వ‌రీ క‌ష్ట‌మే.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం కేసులో ట్విస్ట్‌

FSL Fire Accident | త్రినేత్ర‌.న్యూస్‌: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (FSL) అగ్నిప్రమాదం (FSL Fire Accident) కేసులో కీలక మలుపు జరిగింది. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్‌ దగ్ధం అయినట్లు నాగపూర్ ప్ర‌త్యేక బృందం గుర్తించింది.

G

Hyderabad | Published On Feb 21, 2026, 9.55 am IST

FSL Fire Accident | రిక‌వ‌రీ క‌ష్ట‌మే.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం కేసులో ట్విస్ట్‌
Advertisement

FSL Fire Accident | త్రినేత్ర‌.న్యూస్‌: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (FSL) అగ్నిప్రమాదం (FSL Fire Accident) కేసులో కీలక మలుపు జరిగింది. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్‌ దగ్ధం అయినట్లు నాగపూర్ ప్ర‌త్యేక బృందం గుర్తించింది. ఈ కేసుల డేటా రికవరీ కోసం బృందం యత్నించినప్ప‌టికీ అది సాధ్యంకాలేదు. దీంతో 11 వంద‌ల కేసుల డేటా రికవరీ కష్టమేన‌ని తేల్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల 7న ఉద‌యం 10.35 గంట‌ల‌కు నాంప‌ల్లిలోని ఎఫ్‌ఎస్‌ఎల్ భవనం మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీంతో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్‌ చేసిన హార్డ్‌డిస్కులు, కేసు రికార్డులు అగ్నికి ఆహుత‌య్యాయి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా కాలి బూడిదైనట్టు విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ రెండు అంతస్తులున్నది. ప్ర‌మాదంలో ఒకటో అంతస్తు మాత్ర‌మే పూర్తిగా దగ్ధమవడం, రెండో, కింది అంత‌స్తుకు మంట‌లు వ్యాపించ‌క‌పోవ‌డంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, ఈ ఘ‌ట‌న‌పై ఇంకా ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ది.

Advertisement
Advertisement