Car Racing | పోలీసులపైకి దూసుకెళ్లారు.. రాయదుర్గంలో రెచ్చిపోయిన కార్ రేసర్లు.. వీడియో
Car Racing | హైదరాబాద్ రాయదుర్గంలో (Rayadurgam) కార్ రేసర్లు (Car Racing) రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి నాలెడ్డ్ సిటీ (Knowledge City) వద్ద రేసింగ్ నిర్వహించారు.
Car Racing | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ రాయదుర్గంలో (Rayadurgam) కార్ రేసర్లు (Car Racing) రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి నాలెడ్డ్ సిటీ (Knowledge City) వద్ద రేసింగ్ నిర్వహించారు. భారీగా శబ్ధం వచ్చేలా కార్లకు సైలెన్సర్లు అమర్చి హంగామా సృష్టించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు. దీంతో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఒక రేసర్‌ని అరెస్టు చేయగా.. మిగతా వారంతా పరారయ్యారు.
వారాంతాల్లో టీ హబ్, ఐక్య, మై హోమ్ భుజ రోడ్లపైకి రేసింగ్ పేరుతో యువత హంగామా సృష్టిస్తున్నారు. ఇదే తరహాలో శనివారం అర్ధరాత్రి మరోసారి రెచ్చిపోయారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేశారు. ఈ క్రమంలో హోండా సిటీ కారును పోలీసులు అడ్డుకున్నారు. అయితే వారి కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. కారుతో పోలీసులపైకి దూసుకెళ్లడంతో రమేశ్ అనే కానిస్టేబుల్ చేతికి గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. కారును అడ్డుకుని అద్దాలు ధ్వంసం చేశారు. రేసింగ్‌కు పాల్పడిన రేహాన్ (19 ) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న మరో ఇద్దరు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#Hyderabad: #Midnight chaos near #NilouferCafe in #Madhapur as #reckless drivers turned city roads into a #racingtrack during the weekend.
Groups of #youths allegedly performed #dangerous #car and #bike racing late at night, ignoring repeated #warnings from the police.… pic.twitter.com/6c5xkqw4Ei
— NewsMeter (@NewsMeter_In) May 24, 2026
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026

Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



