Kavya Thapar | కావ్య థాపర్‌కు మరో ఛాన్స్.. ‘నేను రెడీ’తోనైనా అదృష్టం కలిసొచ్చేనా?
Kavya Thapar | సినిమా రంగంలో అవకాశాలు రావడం ఒక ఎత్తయితే.. వాటిని విజయాలుగా మార్చుకోవడం సినీ ప్రయాణంలో అసలైన పరీక్ష. ఇప్పుడు అలాంటి కీలక దశలో ఉంది నటి కావ్య థాపర్. కొంత విరామం తర్వాత ‘నేను రెడీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమె.. ఈ సినిమాతో కెరీర్‌లో మరో మలుపు కోసం ఎదురుచూస్తోంది.
Entertainment | Published On Jul 29, 2026, 3.40 pm IST
Kavya Thapar | సినిమా రంగంలో అవకాశాలు రావడం ఒక ఎత్తయితే.. వాటిని విజయాలుగా మార్చుకోవడం సినీ ప్రయాణంలో అసలైన పరీక్ష. ఇప్పుడు అలాంటి కీలక దశలో ఉంది నటి కావ్య థాపర్. కొంత విరామం తర్వాత ‘నేను రెడీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమె.. ఈ సినిమాతో కెరీర్‌లో మరో మలుపు కోసం ఎదురుచూస్తోంది. అందం, అభినయంతో ప్రారంభంలోనే గుర్తింపు తెచ్చుకున్న కావ్య థాపర్‌కు వరుస అవకాశాలు వచ్చినా.. స్టార్ హీరోయిన్ స్థాయిలో నిలబెట్టే భారీ విజయం మాత్రం ఇంకా దక్కలేదు. దీంతో కొంతకాలంగా తెలుగు తెరపై ఆమె సందడి తగ్గింది.
ఇప్పుడు ‘నేను రెడీ’ ఆమె కెరీర్‌కు కీలక చిత్రంగా మారనుంది. ముంబయికి చెందిన కావ్య థాపర్ మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. వాణిజ్య ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెమెరా ముందుకు వచ్చిన ఆమె.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తమిళ చిత్రం ‘మార్కెట్ రాజా ఎంబీబీఎస్’తో సినీ రంగ ప్రవేశం చేసిన కావ్య.. తెలుగులో ‘ఏక్ మినీ కథ’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర యువతను ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ నటించిన ‘ఈగల్’ చిత్రంలో కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా.. కావ్యకు మాత్రం నటిగా మరిన్ని అవకాశాలు అందుకుంది.
అనంతరం గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ‘విశ్వం’లోనూ భాగమైంది. చాలా రోజుల విరామం తర్వాత ‘నేను రెడీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది కావ్య. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హవిష్ హీరోగా నటిస్తున్నాడు. నటి నర్గిస్ ఫక్రి ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం విజయవంతమైతే కావ్యకు మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నది. సినీ రంగంలో ఒక్క విజయం కూడా నటీనటుల కెరీర్ దిశను మార్చేస్తుంది. సరైన కథ, సరైన పాత్ర లభిస్తే ఆలస్యంగా వచ్చిన విజయాలు కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. ఇప్పుడు కావ్య థాపర్ కూడా అలాంటి విజయానికే ఎదురుచూస్తోంది. ‘నేను రెడీ’ ఆమె కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్




