త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Mallareddy | నా మీద ప‌గ ప‌ట్టొద్దు శ్రీధ‌ర‌న్నా.. స‌భ‌లో ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి ఆవేద‌న‌

MLA Mallareddy | నా మీద ప‌గ ప‌ట్టొద్దు.. కుట్ర చేయొద్దు.. అభివృద్ధికి నిధులు విడుద‌ల చేయండ‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబును మేడ్చ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి వేడుకున్నారు. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డ్ మురికి కూపంగా మారింది.. దాన్ని చూస్తే భ‌రించ‌లేనంత బాధ ఉంద‌ని మ‌ల్లారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Hyderabad | Published On Mar 24, 2026, 12.00 pm IST

MLA Mallareddy | నా మీద ప‌గ ప‌ట్టొద్దు శ్రీధ‌ర‌న్నా.. స‌భ‌లో ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి ఆవేద‌న‌
Advertisement

MLA Mallareddy | త్రినేత్ర‌.న్యూస్ : నా మీద ప‌గ ప‌ట్టొద్దు.. కుట్ర చేయొద్దు.. అభివృద్ధికి నిధులు విడుద‌ల చేయండ‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబును మేడ్చ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి వేడుకున్నారు. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డ్ మురికి కూపంగా మారింది.. దాన్ని చూస్తే భ‌రించ‌లేనంత బాధ ఉంద‌ని మ‌ల్లారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌హ‌దారుల మౌలిక స‌దుపాయాల‌పై మ‌ల్లారెడ్డి మాట్లాడారు.

నా 50వ పెళ్లి వేడుక‌ల‌కు వ‌చ్చినా రాకున్నా బాధ లేదు. కానీ చాలా బాధాక‌రంగా ఉన్న‌ది.. ఇబ్బందిక‌రంగా ఉన్న‌ది. ఈ బాధ మా ఇంచార్జి మంత్రి వ‌ల్ల‌నే. శ్రీధ‌ర్ బాబు ఇంచార్జి వ‌స్తారంటే మంచిది అనుకున్నాం. మంచి మిత్రుడు. 2009లో మంత్రిగా నా కాలేజీల‌కు హెల్ప్ చేశాడు. మాకు మ‌ళ్లా ఇంచార్జి మంత్రి అయినందుకు హ్యాపీగా ఫీల‌య్యాను. ఇప్పుడు భ‌రించ‌లేనంత బాధ‌ప‌డుతున్నాను. గుండె బాధ‌తో భ‌రించ‌లేక‌పోతుంది. నా నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్రాంతం నా గుండెకాయ‌. గ‌త 20 ఏండ్ల నుంచి చెత్త అక్క‌డ్నే వేస్తున్నారు. అది ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతుంది అని మ‌ల్లారెడ్డి తెలిపారు.

జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డులో చెత్త నుంచి క‌రెంట్ ఉత్ప‌త్తి చేసేందుకు కేటీఆర్ రూ. 500 కోట్లు ఇచ్చిండు క‌రెం అది కాకుండా 140 కోట్ల‌తో క్యాపింగ్ పెట్టినం. వ‌ర్షాకాలంలో మురుగు నీరు ఫిల్ట‌ర్ చేసేందుకు 250 కోట్ల‌తో ఎస్టీపీ పెట్టాం. వాస‌న రాకుండా చేశాం. రెండేండ్ల నుంచి మ‌ళ్లీ చెత్త‌కుండీని త‌యారు చేశారు. అంతా కాలుష్య‌మ‌యం. రెండున్న‌ర ల‌క్ష‌ల ప్ర‌జ‌లు అక్క‌డ ఉంటున్నారు. వారు క‌నీసం ఉండ‌లేక‌పోతున్నారు అని మ‌ల్లారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నువ్వంటే నాకు చాలా అభిమానం శ్రీధ‌ర‌న్నా.. నా మీద ప‌గ ప‌ట్టొద్దు.. నా నియోజ‌క‌వ‌ర్గం దేశంలోనే నంబ‌ర్ వ‌న్ నియోజ‌క‌వ‌ర్గం. మేడ్చ‌ల్ బంగారం లాంటిది. కానీ మేడ్చ‌ల్‌ను తుకుడ‌లు తుకుడ‌లు చేశారు. అత‌లాకుత‌లం చేశారు. 61 గ్రామాలు, 3 కార్పొరేష‌న్లు 7 మున్సిపాలిటీల‌ను జీహెచ్ఎంసీలో క‌లిపారు. ఇప్పుడు ఇక్క‌డ్నుంచి ఎందుకు గెలిచాను అని బాధ‌ప‌డుతున్నాను. స్పెష‌ల్ ఫండ్ ఇచ్చి శుభ్రం చేయాలి. ఆ వాస‌న భ‌రించ‌లేక రోజుకు ఒక‌రు చ‌నిపోతున్నారు.. హ‌స్పిట‌ల్ బారిన ప‌డుతున్నారు ప్ర‌జ‌లు. ఒక్క‌సారి ప‌రిశీలించి నిధులు ఇవ్వండి. అభివృద్ధి కార్య‌క్ర‌మాల శంకుస్థాప‌న‌ల‌కు, ప్రారంభోత్స‌వాల‌కు శ్రీధ‌ర్ బాబు రాకుండా మ‌హేంద‌ర్ రెడ్డిని పంపిస్తున్న‌రు.. నా మీద కుట్ర ప‌న్నుతున్న‌రు. ఇక ఘ‌ట్‌కేస‌ర్ ప‌రిధిలో ఓ చిన్న‌ ఫ్లై ఓవ‌ర్ వ‌ల్ల ముగ్గురు కాంట్రాక్ట‌ర్లు చ‌నిపోయారు. 4 కోట్లు విడుద‌ల చేయండి అని మ‌ల్లారెడ్డి కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement