త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Ramesh admire to Shashikumar | శ‌భాష్ శ‌శికుమార్‌.. నీ మాన‌వ‌త్వం ఎంద‌రికో స్ఫూర్తి

CP Ramesh admire to Shashikumar | రెండేళ్ల బాలిక‌ను ర‌క్షించిన శశికుమార్ ధైర్యం, తెగువ ఎందరికో స్ఫూర్తి అని సైబ‌రాబాద్ సీపీ డాక్ట‌ర్ ఎం.ర‌మేశ్ పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Sep 24, 2026, 7.27 pm IST

CP Ramesh admire to Shashikumar | శ‌భాష్ శ‌శికుమార్‌.. నీ మాన‌వ‌త్వం ఎంద‌రికో స్ఫూర్తి
Advertisement
  • కామాంధుడి నుంచి బాలిక‌ను ర‌క్షించిన వ్య‌క్తికి సైబ‌రాబాద్ సీపీ అభినంద‌న‌

CP Ramesh admire to Shashikumar | త్రినేత్ర న్యూస్: రెండేళ్ల బాలిక‌ను ర‌క్షించిన శశికుమార్ ధైర్యం, తెగువ ఎందరికో స్ఫూర్తి అని సైబ‌రాబాద్ సీపీ డాక్ట‌ర్ ఎం.ర‌మేశ్ పేర్కొన్నారు. అత్యాచార ప్ర‌మాదం నుంచి బాలిక‌ను స‌మ‌య‌స్ఫూర్తితో ర‌క్షించి త‌మ‌కు అప్ప‌గించ‌డం ఎంతో అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈమేర‌కు గురువారం గంగారం చెరువు వద్దకు శ‌శికుమార్‌ను పిలిచి శాలువాతో సత్కరించి అభినందించారు.

గ‌త ఆగస్టు 16న ఓ రెండేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి నుంచి బాలికను శశికుమార్ ధైర్యంగా రక్షించారు. మార్గంలో వెళ్తుండగా బాలిక అరుపులు విని వెంటనే స్పందించిన శశికుమార్, అక్కడికి చేరుకుని బాలికను సురక్షితంగా రక్షించాడు. అంతేకాకుండా నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. త‌క్ష‌ణ‌మే స్పందించి చిన్నారిని రక్షించడం అభినందనీయం. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. శశికుమార్ చూపిన ధైర్యం, మానవత్వం ఇతరులకు స్ఫూర్తిదాయకం అని సీపీ తెలిపారు.

Advertisement
Advertisement